TCS టెర్రర్ లింక్స్? ఇన్వెస్టిగేషన్ లో బయటపడ్డ ఉగ్ర వ్యూహాలు!

ఒక ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ టీసీఎస్ లో ఉద్యోగం దొరికితే జీవితం స్థిరపడిందని సంతోషించిన యువతులకు అక్కడ నరకం ఎదురైంది. నాసిక్ బ్రాంచ్ లోని ఆఫీసు డెస్కులే వారిని మానసికంగా, శారీరకంగా దోపిడీ చేసే వేదికలుగా మారాయి. టీమ్ లీడర్ల (TL) సీట్ల వద్దకు పిలిపించి అసభ్యకరమైన భాషతో వేధించడం నుంచి, మతం మారాలంటూ ఒత్తిడి తెచ్చే వరకు సాగిన ఈ దారుణ ఉదంతం ఇప్పుడు 'నాసిక్ జిహాద్' మోడల్ పేరుతో సంచలనం సృష్టిస్తోంది.

ఈ మొత్తం కుట్రలో కీలక పాత్రధారిగా భావిస్తున్న హెచ్‌ఆర్ మేనేజర్ నిదా ఖాన్ ఇప్పుడు పోలీసులకు చిక్కకుండా దోబూచులాడుతోంది. 18 నుంచి 25 ఏళ్ల లోపు యువతులను టార్గెట్ చేసి, వారిని మత మార్పిడి ముఠాకు ఎరగా వేసిన ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. తాజాగా ఆమె గర్భం దాల్చాననే సాకు చూపి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తుండటం గమనార్హం. బాధితురాలిలా కనిపించేందుకు ఆమె వేస్తున్న ఈ ఎత్తుగడను ప్రాసిక్యూటర్లు గట్టిగా వ్యతిరేకించేందుకు సిద్ధమవుతున్నారు.

TCS Nashik Case Shocker How a Parallel System Exploited Women Employees for Forced Religious Conversions

విషపూరిత సంస్కృతి.. భద్రత పేరుతో నిఘా!

ఈ కేసులో బాధితులైన మాజీ ఉద్యోగులు వెల్లడించిన నిజాలు వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. కార్యాలయంలో ఫోన్లు, బ్యాగులు, చివరికి లంచ్ బాక్సులను కూడా లోపలికి అనుమతించకపోవడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. అక్కడ జరిగే అరాచకాలు ఎక్కడా డాక్యుమెంట్ కాకూడదనే ఉద్దేశంతోనే ఈ ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. మహిళా ఉద్యోగులు పండుగల సమయంలో చీరలు కట్టుకున్నా, బొట్టు పెట్టుకున్నా తౌసిఫ్ అత్తర్ వంటి టీమ్ లీడర్లు వారిని అవమానిస్తూ, ఇస్లాం గొప్పదని బోధించేవారు. ఒక హిందూ సహోద్యోగిని కూడా పక్కా ప్లాన్ ప్రకారం మతం మార్పించిన ఉదంతం ఇక్కడ బయటపడింది.

TCS: మహిళా ఉద్యోగులపై రేప్, వేధింపులు, మతమార్పిడులు-లీడ్స్ అరెస్ట్..!
TCS: మహిళా ఉద్యోగులపై రేప్, వేధింపులు, మతమార్పిడులు-లీడ్స్ అరెస్ట్..!

హోటల్ బుకింగ్స్.. వీకెండ్ ట్రిప్పులు!

డానిష్ షేక్, రజా మెమోన్ వంటి నిందితులు కార్యాలయం నుంచే హోటళ్లు, రిసార్టులను బుక్ చేసేవారు. యువ మహిళా ఉద్యోగులు తమతో కలిసి వీకెండ్ ట్రిప్పులకు రావాలని తీవ్రమైన ఒత్తిడి తెచ్చేవారు. పెళ్లి చేసుకుంటామని తప్పుడు వాగ్దానాలు చేసి శారీరకంగా వాడుకోవడం, ఆపై మతం మారితేనే పెళ్లి అన్న నిబంధనలు పెట్టడం వంటివి ఒక 'మతాంతర కుట్ర' (Grooming) తరహాలో సాగాయి.

బొట్టు, తిలకం ఉంటే నో ఎంట్రీ.. హిజాబ్ అయితే ఓకే.. ఉద్యోగులకు షాకింగ్ రూల్స్ !!
బొట్టు, తిలకం ఉంటే నో ఎంట్రీ.. హిజాబ్ అయితే ఓకే.. ఉద్యోగులకు షాకింగ్ రూల్స్ !!

అసలు ప్రశ్న: మేనేజ్మెంట్ ఏం చేస్తోంది?

ఇంత పెద్ద సంస్థలో ఒక "సమాంతర వ్యవస్థ" అంత కాలం ఎలా నడిచింది? సెక్యూరిటీ కెమెరాలు, ఆడిట్ టీమ్స్ ఉన్నప్పటికీ ఈ అరాచకాలు సీనియర్ మేనేజ్‌మెంట్ దృష్టికి ఎందుకు వెళ్లలేదు? అన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఇప్పటికే ఎడుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, మరో మహిళా నిందితురాలి కోసం గాలిస్తున్నారు.

మరోవైపు, ఇటువంటి మోసపూరిత మత మార్పిడులను అరికట్టాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కావడం ఈ కేసు తీవ్రతను తెలియజేస్తోంది. కార్పొరేట్ ఆఫీసులే లక్ష్యంగా సాగుతున్న ఈ 'సాంస్కృతిక ఉగ్రవాదం'పై పోలీసులు ఇప్పుడు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+