మచ్చలేని చంద్రుడు మా చంద్రన్న, అసలు ఏంజరిగిందంటే, ఇదే ఫుల్ మ్యాటర్ !
అమరావతి/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయకుడు తీసుకు వచ్చిన స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, జగన్ ప్రభుత్వం లేనివి ఉన్నట్లు చూపించి టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసి జైలుకు పంపించారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు.
గురువారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన అచ్చెన్నాయుడు వైకాపా ప్రభుత్వం మీద, జగన్ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శించారు. స్కిల్ డెవలప్ మెంట్ అనే స్కామ్ పేరును తెరమీదకు తెచ్చిన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మాజీ ముఖ్యమంత్రి, పేదల కోసం శ్రమించిన చంద్రబాబు నాయుడి మీద కక్షసాధించడానికి ప్రయత్నించారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమం ద్వారా రాయలసీమలోని చిత్తూరు క్లస్టర్ లో 37,500 మంది శిక్షణ పొందారని, అనంతపురం కస్టర్ల్ లో 37,500 మంది, క్రిష్ణా క్లస్టర్ లో 39,000 మంది, విశాఖ క్లస్టర్ లో 34,000 మంది, గుంటూరు క్లస్టర్ లో 35, 500 మంది శిక్షణ పొందారని, వీళ్లకు కేవలం శిక్షణ ఇవ్వడమే కాకుండా అందరికి సర్టిఫికెట్లు కూడా మంజూరు చేశారని అచ్చెన్నాయుడు చెప్పారు.

స్కిల్ డెవలప్ మెంట్ లో శిక్షణ పొందిన సుమారు 65 వేల మందికి పైగా ఉద్యోగాలు కూడా వచ్చాయని, ఆ పూర్తి వివరాలు, సమాచారం వెబ్ సైట్ లో కూడా పొందుపరిచారని, వైకాపా నాయకుల కళ్లకు ఈ సమాచారం కనపడటం లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కేబినెట్ ఆమోదంతోనే స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఏర్పాటు చేసి యువతకు శిక్షణ ఇచ్చి యువతకు ఉద్యోగాలు ఇప్పించిన పాపానికి చంద్రబాబును జైలుకు పంపించారని, చంద్రబాబు మచ్చలేని నాయకుడిగా జైలు నుంచి విడుదల అవుతారని టీడీపీ సీనియర్ నాయకుడు అచ్చెన్నాయుడు అన్నారు.












Click it and Unblock the Notifications