చిత్తూరు జిల్లాతో శ్రీకారం చుడుతున్న సీఎం, పెద్దిరెడ్డి భజన బ్యాచ్ కు దబిడి దబిడే ?

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఐదు ఏళ్లలో కొందరు అధికారులు ఆ పార్టీ నాయకులకు ఊడిగం చేశారని ఆరోపణలు ఉన్నాయి. పేరుకు ప్రభుత్వ ఉద్యోగులు అయినా ప్రజలకు సేవ చెయ్యకుండా వైసీపీ నాయకులకు ఊడిగం చేస్తూ నిత్యం రామభజన చేసినట్లు ఆ నాయకుల పేర్లు తలచుకుంటూ భజన చేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి.

ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో పలు జిల్లాల్లో పోలీసు శాఖ, వైద్య, విద్యా శాఖ, పురపాలక, గనులు, అటవి శాఖ, పరిపాలన శాఖ, విద్యుత్ తదితర శాఖల అధికారులు మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పినట్లు గంగిరి ఎద్దుల్లా తలలు ఊపారని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో కొందరు అధికారుల తీరుపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

TDP targeted an officer who worked in favor of Peddireddy in Chittoor district in YCP government

అప్పటి ప్రతిపక్ష పార్టీ నాయకుడి హోదాలో ఉన్న చంద్రబాబును ఆయన సొంత నియోజక వర్గం కుప్పంలోకి వెళ్లనివ్వకుండా నానా ఇబ్బందులకు గురి చేసిన పోలీసు అధికారులు అందరూ ఇప్పటికే మూల్యం చెల్లించుకున్నారు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అడ్డా పుంగనూరులో పెత్తనం చెలాయించిన పుంగనూరు మునిసిపల్ కమీషనర్ నరసింహ ప్రసాద్ రెడ్డి వంతు వచ్చింది. పుంగనూరులో పెద్దిరెడ్డి నమ్మినబంటూలా వ్యవహరించిన నరసింహ ప్రసాద్ రెడ్డి ఊహించన అధికారాలు సొంతం చేసుకున్నారు.

అప్పటి మంత్రి పెద్దిరెడ్డి ఆశీస్సుతో పుంగనూరు మునిసిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ రెడ్డికి కొంతకాలం పాటు కుప్పం మునిసిపల్ కమిషనర్ ఇన్ చార్జ్ బాధ్యతలు కూడా అప్పగించారు. ఇటు పుంగనూరులో, అటు కుప్పంలో మునిసిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ రెడ్డి టీడీపీ కార్యకర్తలు, కాంట్రాక్టర్లతో పాటు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించిన ఇంటి యజమానులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆరోపణలు ఉన్నాయి.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు పుంగనూరులో జయచంద్ర నాయుడు అనే వ్యక్తి ఆయన ఇంటిని టీడీపీ కార్యాలయం కోసం అద్దెకు ఇచ్చాడు. అంతే పెద్దిరెడ్డి వర్గీయులకు ఎక్కడో కాలిపోయిందని తెలిసింది. పుంగనూరులో టీడీపీ కార్యాలయం ఎలా పెడుతారు అంటూ రెచ్చిపోయారు. పుంగనూరు మునిసిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ పెద్దిరెడ్డి మీద ఉన్న స్వామి భక్తితో జయంద్ర నాయుడు ఇల్లు నిబందనలకు వ్యతిరేకంగా నిర్మించారని ఆయనకు నోటీసులు ఇచ్చి ఆయన మీద ఒత్తిడి తీసుకు వచ్చి టీడీపీ కార్యాలయాన్ని ఖాళీ చేయించారు.

TDP targeted an officer who worked in favor of Peddireddy in Chittoor district in YCP government

అలాగే కుప్పం మునిసిపల్ కమిషనర్ గా పని చేసిన చిట్టిబాబు కూడా వివాదాలకు తెరలేపి పెద్దిరెడ్డి చెప్పినట్లు చేశారని ఆరోపణలు ఉన్నాయి. కుప్పం మునిసిపాలిటీని 25 వార్డుల్లో ఏ ఒక్క వార్డులో కూడా ఎన్నికలు జరగనివ్వకుండా చేసి ఏకగ్రీవం చేసి చంద్రబాబును దెబ్బకొట్టాలని పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మొదట ప్లాన్ చేశారు. ఆ సమయంలో కుప్పం మునిసిపల్ వార్డులో టీడీపీ తరపున నిలబడటానికి ప్రయత్నించిన టీడీపీ నాయకులను అప్పటి చిట్టిబాబు చాలా ఇబ్బందుకు గురి చేశాడని ఆరోపణలు ఉన్నాయి

అయితే అప్పట్లో టీడీపీ నాయకులు నిమ్మల రామానాయుడు, ఎన్. అమరనాథ రెడ్డి తదితరులు ఆందోళన చెయ్యడంతో నిబందనలకు వ్యతిరేకంగా రాత్రి 8 గంటల సమయంలో ఒక్క వార్డులో మాత్రం ఏకగ్రీవం అయ్యిందని చిట్టిబాబు ప్రకటించడం అప్పట్లో విదాదాలకు కారణం అయ్యింది. ఇక పుంగనూరు ఎస్ఐ శివకుమార్ పెద్దిరెడ్డి చెప్పినట్లు ఆడాడని, టీడీపీ కార్యకర్తలను చిత్రహింసలు పెట్టాడని ఆరోపణలు ఉన్నాయి.

చిత్తూరు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిగా పని చేసిన డాక్టర్ శ్రీహరి కూడా నిబంధనలకు విరుద్దంగా పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చెప్పిన వాళ్లకే స్టాఫ్ నర్సు, వైద్య శాఖలో కాంట్రాక్టు ఉద్యోగాలు ఇచ్చేశారని ఆరోపణ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇలాంటి అధికారులకు చుక్కలు కనపడుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+