టీచర్ పైశాచికం: కత్తెరతో దాడి చేసి, ఐదో తరగతి విద్యార్థినిని బాల్కనీ నుంచి విసిరేసింది
న్యూఢిల్లీ: తల్లిదండ్రుల తర్వాత అంత ప్రాధాన్యం కలిగిన స్థానంలో ఉన్న ఓ ఉపాధ్యాయురాలు.. పాఠశాల విద్యార్థినిపై పైశాచికంగా దాడి చేశారు. ఐదో తరగతి విద్యార్థినిని తీవ్రంగా కొట్టిన ఉపాధ్యాయురాలు.. ఆ తర్వాత భవనంపైనుంచి కిందికి తోసేసింది.
ఈ ఘటన ఢిల్లీ నగర్ నిగమ్ బాలిక విద్యాలయలో చోటు చేసుకుంది. పాఠశాల భవనం మొదటి అంతస్తు నుంచి తోసేయడంతో వందన అనే విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి కొంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బాలిక ప్రస్తుతం బారా హిందూరావు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

శుక్రవారం ఉదయం 11.15 గంటలకు జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితురాలైన ఉపాధ్యాయులు రాలు గీతా దేశ్వాల్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
కాగా, పాఠశాల భవనంపైనుంచి విద్యార్థిని తోసేసే ముందే వందనపై కత్తెరతో దాడి చేసినట్లు తెలుస్తోంది. విద్యార్థిని కొడుతున్న సమయంలో మరో ఉపాధ్యాయురాలు రియా అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ గీత దాడికి పాల్పడింది.
ఘటనపై బాలిక తల్లిదండ్రులు, బంధులు ఆందోళన వ్యక్తం చేశారు. సదరు టీచర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications