Teacher: సైన్స్ పాఠాలు చెప్పమంటే వీడు స్కూల్ లో ఏం చేశాడంటే ?, ప్రభుత్వ స్కూల్ టీచర్, ఫినిష్ !
చెన్నై/ కరూర్: ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ టీచర్ గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఆ స్కూల్ లో చదువుతున్న అమ్మాయిల మీద కన్ను వేశాడు. స్కూల్ లో సైన్స్ పాఠాలు చెబుతున్న టీచర్ చేతిలో టెక్ట్స్ బుక్ పెట్టుకుని దాన్ని చూస్తున్నట్లు నటిస్తూ అమ్మాయిల పట్ల అసభ్యంగా మాట్లాడటం, వారి వైపు చూసి తిక్కతిక్క చేష్టలు చేస్తూ పైపైన అతని కామం తీర్చుకోవడానికి ప్రయత్నించాడు. చాలా కాలం విద్యార్థులు ఇలాంటికి సైన్స్ పాఠాల్లో ఉన్నాయని అనుకున్నారు. అయితే రానురాను సైన్స్ టీచర్ ఆగడాలు ఎక్కువ అయ్యాయి. సైన్స్ టీచర్ కు పైత్యం ఎక్కువ కావడంతో అతని టార్చర్ తట్టుకోలేక అమ్మాయిలు హెడ్ మాస్టర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ స్కూల్ టీచర్ ఆగడాల విషయం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. విషయం తెలుసుకున్న విద్యశాఖా అధికారులు స్వయంగా స్కూల్ కు వెళ్లి విద్యార్తులను విడివిడిగా విచారణ చేసి వారి దగ్గర స్టేట్ మెంట్ తీసుకుని సైన్స్ టీచర్ ను సస్పెండ్ చేశారు. ప్రభుత్వ స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం చేస్తున్న కామాంధుడి మీద విద్యశాఖ అధికారులు విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రభుత్వ స్కూల్ టీచర్
తమిళనాడులోని కరూరు జిల్లా, బగనాథంలో పంచాయితీ యూనియన్ ప్రభుత్వ హై స్కూల్ ఉంది. ఈ ప్రభుత్వ పాఠశాలలో పన్నీర్ సెల్వం (46) అనే వ్యక్తి సైన్స్ టీచర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఈ హై స్కూల్ లో చదువుతున్న అమ్మాయిల మీద ఆ స్కూల్ సైన్స్ టీచర్ పన్నీర్ సెల్వం కన్ను వేశాడు.

పాఠాలు చెప్పకుండా సెక్స్ డైలాగులు వేస్తున్న టీచర్
హై స్కూల్ లో సైన్స్ పాఠాలు చెబుతున్న టీచర్ పన్నీర్ సెల్వం అతని చేతిలో టెక్ట్స్ బుక్ పెట్టుకుని దాన్ని చూస్తున్నట్లు నటిస్తూ అమ్మాయిల పట్ల అసభ్యంగా మాట్లాడటం, వారి వైపు చూసి తిక్కతిక్క చేష్టలు చేస్తూ పైపైన అతని కామం తీర్చుకోవడానికి ప్రయత్నించాడు. చాలాకాలంగా సైన్స్ టీచర్ పన్నీర్ సెల్వం ఇలాగే ప్రవర్తించాడని ఆరోపణలు ఉన్నాయి.

హెడ్ మాస్టర్ కు చెప్పిన అమ్మాయిలు
చాలా కాలం స్కూల్ లో విద్యార్థులు టీచర్ పన్నీర్ సెల్వం చెబుతున్న మాటలు సైన్స్ పాఠాల్లో ఉన్నాయని అనుకున్నారు. అయితే రానురాను సైన్స్ టీచర్ పన్నీర్ సెల్వం ఆగడాలు ఎక్కువ అయ్యాయి. సైన్స్ టీచర్ పన్నీర్ సెల్వంకు పైత్యం ఎక్కువ కావడంతో అతని టార్చర్ తట్టుకోలేక అమ్మాయిలు ఆ స్కూల్ హెడ్ మాస్టర్ కు కామాంధుడి మీద లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

విద్యాశాఖ అధికారులు ఎంట్రీ
ప్రభుత్వ స్కూల్ టీచర్ పన్నీర్ సెల్వం ఆగడాల విషయం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. విషయం తెలుసుకున్న విద్యశాఖా అధికారులు మదన్ కుమార్, రమణి స్వయంగా స్కూల్ కు వెళ్లి విద్యార్తులను విడివిడిగా విచారణ చేసి వారి దగ్గర స్టేట్ మెంట్ తీసుకున్నారు. ఆ సమయంలో స్కూల్ లో చదువుతున్న అమ్మాయిలు సైన్స్ టీచర్ పన్నీర్ సెల్వం ఆగడాల గురించి అధికారులకు చెప్పారు.
Recommended Video

టీచర్ ను ఇంటికి పంపించిన ప్రభుత్వం
చాలా మంది అమ్మాయిలు సైన్స్ టీచర్ పన్నీర్ సెల్వం ఆగడాల గురించి విద్యశాఖ అధికారులకు స్టేట్ మెంట్ ఇచ్చారు. ప్రభుత్వం హై స్కూల్ సైన్స్ టీచర్ పన్నీర్ సెల్వంను సస్పెండ్ చేశామని విజయేంద్రన్ మీడియాకు చెప్పారు. ప్రభుత్వ స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం చేస్తున్న కామాంధుడు పన్నీర్ సెల్వం మీద విద్యశాఖ అధికారులు విచారణకు ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications