• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

షాక్: పతనమైన టెక్ మహీంద్ర షేర్లు, రూ.7 వేల కోట్ల నష్టం

By Narsimha
|

ముంబై:దేశీయ ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా సోమవారం నాడు మార్కెట్ లో భారీగా నష్టపోయింది. భారత ఐదవ అతిపెద్ద ఐటీ సేవలసంస్థ గత ఏడాది నాలుగవ క్వార్టర్ ఫలితాల్లో అంచనాలను అందుకోలేక చతికిలపడింది.

దరిమిలా భారీగా అమ్మకాలు వెల్లువెత్తాయి. ఇన్వెస్టర్ల అమ్మకాలతో టెక్ మహీంద్రా షేర్ ఈ ఒక్కరోజులోనే 17 శాతానికి పైగా పతనమైంది. కేవలం నిమిషాల వ్యవధిలోనే కంపెనీ మార్కెట్ విలువ భారీగా క్షీణించింది.ఆరంభంలోనే భారీగా కుప్పకూలడంతో రూ. 7వేల కోట్ల వాటాదారుల సొమ్ము తుడిచిపెట్టుకుపోయింది.

అమ్మకాల ధోరణి ఇంకా కొనసాగే అవకాశం ఉందంటూ ఎనలిస్టులు హెచ్చరిస్తున్నారు. ముంబై ఆధారిత టెక్ సేవల సంస్థ టెక్ మహీంద్రా శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత ప్రకటించిన మార్చి క్వార్టర్ ఫలితాల్లో నిరాశపరిచింది. ఆపరేటింగ్ మార్జిన్ అంతకుముందు ఏడాది 16.7 శాతంతో పోలిస్తే ఈ మార్చి త్రైమాసికంలో 12 శాతానికి పడిపోయింది.

 Tech Mahindra Shares Tank 17%, Shareholders Lose Rs. 7,000 Crore

ఈ కౌంటర్లో భారీ అమ్మకాలకు తెరలేచింది. దీంతో మార్కెట్ ఆరంభంలోనే కుదేలై 43 నెలల కనిష్టాన్ని నమోదుచేసింది. జనవరి-మార్చి మధ్యలో (క్వార్టర్ 4) కంపెనీ నికర లాభం 33 శాంత పైగా క్షీణించి రూ.590 కోట్లకు పరిమితమైంది. ఎనలిస్టులు రూ.783 కోట్లుగా అంచనాలు వేశారు. మొత్తం ఆదాయయం కూడ తగ్గి రూ.7495 కోట్ల వద్ద అంతంతమాత్రంగానే ఆర్జించడం సెంటిమెంట్ ను భారీగా దెబ్బతీసింది.

కన్సాలిడేటెడ్ పన్ను ఖర్చులు 28 శాతం పెరిగి రూ.232 కోట్లకు చేరగా, సేవల వ్యయం 14.7 శాతం సాధించింది. డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ తో తమకు మంచి మద్దతు లభించనుందని సీఈఓ సీపీ గూర్నిని తెలిపారు.

అలాగే నెట్ వర్కింగ్ బిజినెస్ ఒప్పందం నుండి వైదొలగడంతో 20 మిలియన్ల డాలర్ల నష్టం బలపడుతున్న దేశీయ కరెన్సీ రుపీ కంపెనీ రీ ఫ్రోఫైలింగ్ కారణంగా ఈ భారీ పతనమని సీఈవో మిలింద్ కులకర్ణి చెప్పారు. ఫలితాల ప్రకటన సందర్భంగా వాటాదారులకు రూ.9 డివిడెండ్ ను సంస్థ ప్రకటించింది. నిర్మాణాత్మక బలహీనతలు, రెవిన్యూ క్షీణత తదితర కారణాలతో టెక్ మహీంద్రాలో సెల్ కాల్ ఇస్తున్నట్టు డొమెస్టిక్ బ్రోకరేజ్ సంస్థ నిర్మల్ బ్యాంగ్ ప్రకటించింది.

English summary
Shares of India's fifth-biggest software services provider Tech Mahindra tanked as much as 17 per cent to Rs. 357 as soon as the market opened today, eroding investor's wealth by nearly Rs. 7,000 crore as it reported lower-than-expected fourth-quarter profit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more