Techie Couple:లక్షల్లో జీతం..హ్యాపీగా సాగే లైఫ్ - కట్ చేస్తే గదిలో శవమై..!!

గురుగ్రామ్‌లో విషాదం చోటు చేసుకుంది. టెక్ రంగంలో ఉన్నత స్థానంలో ఉంటారని భావించిన దంపతుల జీవితం విషాదంతో ముగిసింది. వారు కన్న కలలను నిజం చేసుకోవాలని అనుకున్నప్పటికీ ఆలోచనతో కాకుండా క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ దంపతులను ఈ లోకంలో లేకుండా చేసిది. ఒకరు హత్యగావించబడగా మరొకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంతకీ వారు ప్రాణాలు తీసుకోవాలన్నంతగా వారి జీవితంలో ఏ కష్టమొచ్చింది..?

లక్షల్లో జీతం హ్యాపీగా సాగే లైఫ్

అస్లాం..ఫర్హానా. కేరళలో పుట్టి పెరిగారు. అక్కడే విద్యనభ్యసించారు. మంచి విద్యాసంస్థల్లో ఇద్దరూ చదువుకున్నారు. 2023 వరకు ఒకరికొకరు పరిచయం లేదు. 2023లో వివాహంతో ఇద్దరూ ఒక్కటయ్యారు. ఇక జీవితంలో సెటిల్ కావాలన్న ఆలోచనతో బెంగళూరులో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో చేరారు. కొంతకాలం అక్కడ పనిచేశాక మంచి జీతం కోసం ఇద్దరూ గురుగ్రామ్‌లోని ఓ కంపెనీలో చేరారు. లక్షల్లో జీతం. ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. గురుగ్రామ్‌లోని M3M మెరీనా రెసిడెన్షియల్ సొసైటీలో ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకున్నారు. రోజూ ఉద్యోగం చేసుకుంటూ అలా హ్యాపీగా జీవితం సాగిస్తున్నారు. కన్నవాళ్లు కూడా వారి ఎదుగుదలను చూసి చాలా సంతోషపడటమే కాదు.. గర్వంగా కూడా చుట్టుపక్కలవారికి చెప్పుకునేవారు. అంతా బాగా సాగుతోందన్న తరుణంలో పిడుగులాంటి వార్త. అస్లాం తన భార్యను హత్యచేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు.

techie-couple-found-dead-at-gurugram-we-are-leaving-this-world-says-suicide-note-found-at-apartment

ఈ లోకాన్ని వీడుతున్నాం..

పోలీసులు కథనం ప్రకారం... అస్లాం పనిచేసే కంపెనీకి ఒక ఈ-మెయిల్ వెళ్లింది. ఆ ఈ మెయిల్‌లో "We are leaving this world"(మేము ఈ లోకాన్ని వీడుతున్నాం) అంటూ రాసి ఉంది. ఈ ఈమెయిల్‌ కంపెనీ యాజమాన్యాంతో పాటు తన సహచర ఉద్యోగస్థులకు కూడా పంపాడు. అందులో తన తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లతో పాటు.. ఇంటి ఓనర్ నెంబర్ కూడా రాశాడు. ఇక ఈ మెయిల్ చూసిన సహచర ఉద్యోగులు వెంటనే ఇంటి ఓనర్‌కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని తెలిపారు. వెంటనే ఫ్లాట్‌కు వెళ్లి చూడగా అస్లాం ఉరివేసుకుని వేలాడుతుండటాన్ని గమనించాడు. ఇక ఫర్హానా రక్తమోడుతూ కిందపడి ఉంది. ఓనర్ వచ్చేసరికి అపార్ట్‌మెంట్ తలుపు తెరిచే ఉంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన అక్టోబర్ 14వతేదీ బుధవారం రోజున జరిగింది. ఆ రోజు అస్లాం భార్య ఫర్హానా పుట్టిన రోజు కూడా కావడం విశేషం.

అపార్ట్‌మెంట్‌లో లభించిన సూసైడ్ నోట్

హత్య ఆత్మహత్యకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఫ్లాట్‌కు చేరుకుని విచారణ చేపట్టారు. దర్యాప్తు చేస్తున్న క్రమంలో పోలీసులకు ఈ లోకం వీడి వెళుతున్నాం అంటూ రాసి ఉన్న సూసైడ్ నోట్ లభించింది. అంతేకాదు ఫర్హానా ధరించిన వస్త్రాలపై ఐ లవ్ యూ అంటూ చేతిరాతతో రాసిన అక్షరాలు కనిపించాయి. ఘటనా స్థలం నుంచి పోలీసులు మూడు ల్యాప్‌టాప్‌లు, రెండు మొబైల్ ఫోన్లు, తాడు, డైరీ, కత్తెర, ఒక పెన్‌డ్రైవ్‌లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పరీక్షల నిమిత్తమై పంపించారు.

ప్రాథమిక విచారణ తర్వాత పోలీసులు పలు విషయాలను వెల్లడించారు. అస్లాం తన భార్య ఫర్హానాను ముందుగా హత్య చేసి ఆ తర్వాత అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. ఘటనకు సంబంధించి భారతీయ న్యాయ సంహిత అనుసరించి సెక్షన్ 103(1) హత్యకేసు నమోదు చేశారు. పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

డిప్రెషనే కారణమా..?
అస్లాం కాలికట్‌లోని నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఆ తర్వాత ఐఐఎం ఇండోర్‌లో విద్యనభ్యసించాడు. ఫర్హానా కూడా మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నట్లు సమాచారం. పెళ్లయిన తర్వాత వీరిద్దరి మధ్య ఎలాంటి విబేధాలు లేవని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇద్దరూ ఎంతో అన్యూన్యంగా ఉండేవారని గుర్తు చేశారు. అయితే అస్లాం మాత్రం గత కొన్ని నెలలుగా డిప్రెషన్, ఒత్తిడిని అధిగమించేందుకు చికిత్స తీసుకుంటున్నట్లు బంధువులు తెలిపారు. ఐటీ సెక్టార్‌లో అధిక ఒత్తిడి కారణంగానే లోకాన్ని వీడాలనే నిర్ణయం తీసుకుని ఉంటారని భావిస్తున్నారు. తాను చనిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు భార్యను కూడా హత్య చేసి తాను ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని బంధువులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+