ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. పెళ్లయిన నెల రోజులకే యువ దర్శకుడు మృతి.. ఏమైందంటే..?

ఇండస్ట్రీలోకి రావాలంటే టాలెంట్ తో అదృష్టం కూడా ఉండాలంటారు. అలా తమ టాలెంట్ తో ఇండస్ట్రీలోకి వచ్చి ఒక్కో మెట్టు ఎక్కుతూ తారా స్థాయికి చేరిన సెలబ్రిటీలు ఎందరో ఉన్నారు. అలాగే మలయాళం చిత్ర పరిశ్రమకు చెందిన ఓ యువ దర్శకుడు కూడా కెరీర్ పై ఎన్నో కలలు కన్నాడు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాటపడ్డాడు. కానీ విధి వైపరీత్యంతో హఠాన్మరణం పొందాడు.

మలయాళం చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం జరిగింది. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు బెల్‌ రాజ్ కలరిక్కల్(27) మృతి చెందారు. త‌న తొలి వెబ్‌ సిరీస్ విడుద‌లైన‌ తెల్లారే హఠాన్మరణం చెందడంతో మలయాళం ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. శనివారం కొచ్చిలోని ఓ హోటల్ గదిలో శవమై కనిపించారు బెల్ రాజ్. అయితే ఆయన గుండెపోటుతో మరణించినట్లు స్పష్టం అవుతోంది. ఇక ఆయన ఎంతో కష్టపడి తెరకెక్కించిన తొలి వెబ్ సిరీస్ 'కప్పి స్క్వాడ్'..శుక్రవారమే జియో హాట్‌ స్టార్‌ లో స్ట్రీమింగ్ లోకి అందుబాటులోకి వచ్చింది. అయితే ఆ మ‌రుస‌టి రోజే ఆయ‌న ప్రాణాలు కోల్పోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఎన్నో కలలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన ఇలా సడెన్ గా ప్రాణాలు కోల్పోవడం తోటి దర్శకులు, ఇండస్ట్రీలోని వాళ్లను తీవ్రంగా కలచివేసింది. బెల్ రాజ్ మృతిపై ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

BelrajKalarikkal Young Malayalam director passes away the day after the release of his web series

మరోవైపు యంగ్ దర్శకుడు బెల్‌ రాజ్ కలరిక్కల్ గత ఆరేళ్లుగా ఓ మహిళను ప్రేమిస్తున్నాడు. గత నెల సెప్టెంబర్ లోనే వీరిద్దరి వివాహం జరిగింది. పెళ్లయిన నెల రోజులకే ఇప్పుడు కొచ్చిలోని తన హోటల్ గదిలో ఇలా శవమై కనిపించడంతో అతడి మరణానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు. కానీ పోలీసులు మాత్రం.. గుండెపోటుతో మృతి చెందినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇక బెల్ రాజ్ గతంలో నిజల్, మధురం, డాకిని తదితర చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+