Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బెంగళూరులో ఫస్ట్ త్రిబుల్ తలాక్ కేసు, చిక్కుల్లో టెక్కీ: రూ. 30 లక్షలు దొబ్బాడు !

బెంగళూరు: త్రిబుల్ తలాక్ బిల్లు అమలులోకి వచ్చిన తరువాత భార్య దగ్గరకు వెళ్లి తలాక్ తలాక్ తలాక్ అని చెప్పిన భర్త మీద బెంగళూరులో మొట్ట మొదటి కేసు నమోదు అయ్యింది. ఉద్యోగం ఉందని పొగరుతో తనకు తలాక్ పేరుతో విడాకులు ఇవ్వాలని భర్త వేధింపులకు గురి చేస్తున్నాడని, ఇప్పటికే కట్నం కింద రూ. 30 లక్షలు తీసుకున్నాడని, తాను న్యాయపోరాటం చేస్తానని అంటున్న ఓ మహిళ సాఫ్ట్ వేర్ ఇంజనీరు మీద బెంగళూరులో మొట్ట మొదటి కేసు పెట్టంది.

బెంగళూరులోని గుర్రప్పనపాళ్యలో సమీరుల్లా రెహమత్ (38) అనే సాఫ్ట్ వేర్ ఇంజనీరు నివాసం ఉంటున్నాడు. ప్రసిద్ది చెందిన విప్రో కంపెనీలో సమీరుల్లా రెహమత్ సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. ఇతని భార్య దుబాయ్ లో ఇంజనీరింగ్ విద్యాభ్యాసం పూర్తి చేసింది.

Bengaluru: The first talaq case was registered in Bengaluru after the fast-track triple talaq was banned.

2010 లో సమీరుల్లా రెహమత్, ఆమె కుటుంబ సభ్యులు ఇద్దరి పెళ్లి జరిపించారు. పెళ్లి సమయంలో రూ. 7.50 లక్షల విలువైన కారు, రూ. 10 లక్షలు కట్నం కింద సమీరుల్లా రెహమత్ కు ఇచ్చారని సమాచారం. సమీరుల్లా రెహమత్ దంపతులకు ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు.

ఒక సంవత్సరం క్రితం దంపతుల మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో ఇరు కుటుంబ సభ్యులు, మతపెద్దలు ఇద్దరికి నచ్చచెప్పి బుధ్దిమాటలు చెప్పారు. తరువాత సమీరుల్లా రెహమత్ కు అదనంగా మరో రూ. 7 లక్షలు కట్నం ఇచ్చారు. భార్యను బీటీఎం లేఔట్ ప్రత్యేకంగా ఇల్లు తీసుకుని సమీరుల్లా రెహమత్ నివాసం ఉంటున్నాడు.

అయితే సమీరుల్లా రెహమత్ బీటీఎం లేఔట్ లోని భార్య ఇంటికి వెళ్లడం లేదు. ఇటీవల ఒక రోజు నేరుగా భార్య ఇంటికి వెళ్లిన సమీరుల్లా రెహమత్ తలాక్ తలాక్ తలాక్ అంటూ మూడు సార్లు భార్యకు చెప్పి నీకు విడాకులు ఇస్తున్నానని, నీకు దిక్కున్నచోట చెప్పుకో అని వెళ్లిపోయాడు. తాను ఎంత చెప్పినా తన భర్త సమీరుల్లా రెహమత్ వినడం లేదని, అనవసరంగా విడాకులు ఇచ్చాడని అతని భార్య ఫిర్యాదు చేశారని, కేసు విచారణలో ఉందని సుందగుంటపాళ్య పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+