యువతిపై గ్యాంగ్‌రేప్, బండరాళ్లతో మోది హత్య

బెర్హాంపూర్: ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లాలో దారుణం జరిగింది. ఓ 17ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుండగులు, ఆ తర్వాత ఆమెను హత్య చేశారు. బలిసాహికి చెందిన బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి కాళ్లు ఆమె దుస్తులతో కట్టివేయబడి ఉన్నాయని, ఆమె ముఖంపై వరిగడ్డి వేయబడి ఉందని పోలీసులు తెలిపారు.

ఆమె మృతదేహంపై రెండు పెద్ద బండరాళ్లు ఉండటంతో వాటితోనే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ యువతిని మొదట అత్యాచారం చేసిన దుండగులు, ఆ తర్వాత హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం ఈ విషయం వెల్లడవుతుందని ఓ పోలీసు అధికారి చెప్పారు.
యువతి హత్యపై భిన్న కోణాల్లో విచారణను కొనసాగిస్తున్నామని భంజానగర్ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఆర్‌సి సేథీ తెలిపారు.

 Teen gang-raped, killed in Ganjam

పోలీసుల కథనం ప్రకారం.. గురువారం మధ్యాహ్నం తన తండ్రితో కలిసి ఆ యువతి ఇంటికి సమీపంలోని పొలానికి వెళ్లింది. ఆ తర్వాత తండ్రికి పొలంలో పని ఉండటంతో ఆమె ఒక్కతే ఇంటికి బయల్దేరింది. సాయంత్రం పని అయిపోయాక తండ్రి ఇంటికి వచ్చినా కూతురు ఇంటివద్ద లేదు. దీంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఆమె కోసం గాలించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గురువారం అర్ధరాత్రి ఆ యువతి మృతదేహాన్ని గ్రామ శివారులో గుర్తించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+