అతడు ఆమె కన్నా మూడేళ్లు చిన్న.. అయినా ఇద్దరూ జంప్, సహజీవనం!

Posted By:
Subscribe to Oneindia Telugu

పూణే : పూణేలోని ఆదర్శ్ నగర్ ప్రాంతంలో ఓ అమ్మాయి వయసులో తన కన్నా మూడేళ్లు చిన్నవాడైన ఓ అబ్బాయితో కలిసి జంప్ అయింది. అదేమంటే తామిద్దరం లవర్స్ అని, సహజీవనం చేస్తున్నామని చెబుతోంది.

ఆ బాలుడి తల్లి.. తన మైనర్ కుమారుడిని ఓ యువతి కిడ్నాప్ చేసి తీసుకువెళ్లి మోసపూరితంగా పెళ్లి చేసుకుందంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వింత ఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే... పూణే నగరంలోని దాపొది ప్రాంతానికి చెందిన ప్రతీక్షా భోస్లే(19) చదువుకున్న పాఠశాలలోనే ఓ బాలుడు(16) కూడా చదివే వాడు. ఆ సమయంలో వారిమధ్య ఏర్పడిన స్నేహం ప్రేమకు దారితీసింది.

Teen Girl Arrested for Kidnapping and Fraudulent Marriage to Minor Boy

ఓ రోజు ఉన్నట్లుండి ఇద్దరూ ఎవరి ఇళ్లల్లోనూ చెప్పాపెట్టకుండా పారిపోగా వారి తల్లిదండ్రులు వెతికి ఇంటికి తీసుకొచ్చారు. మళ్లీ నెల క్రితం ప్రతీక్షా భోస్లే తమ కుమారుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి పెళ్లి కూడా చేసుకుందని బాలుడి తల్లి ఆరోపిస్తోంది.

ఆమె ఫిర్యాదు మేరకు పూణే పోలీసులు ప్రతీక్షాపై కిడ్నాప్, మోసపూరితంగా పెళ్లాడిందని ఐపీసీ సెక్షన్ 363, 496,506 ల కింద కేసు నమోదు చేసి, నిందితురాలిని అరెస్టు చేశారు. అయితే ఆ అబ్బాయిని తాను కిడ్నాప్ చేయలేదని, తామిద్దరం ప్రేమించుకున్నామని, అతనితో కలిసి సహజీవనం చేస్తున్నానని ప్రతీక్షా కోర్టులో వెల్లడించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Vishrantwadi police have booked a 19-year-old girl for allegedly kidnapping and performing a fraudulent marriage with a 16-year-old boy at Adarsh Nagar, Dighi. Missing complaints for both the boy and girl were filed by their parents last month and they were found in Dighi on Wednesday. The duo was brought to the police station where the girl, identified as Pratiksha Bhosale of Dapodi, was arrested. The mother of the kidnapped teen has filed a complaint with the Vishrantwadi police, claiming that Bhosale abducted her son and performed a fake marriage.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి