Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రేప్: బాలిక స్నానం చేస్తుంటే.. బాత్రూమ్‌లోకి చొచ్చుకెళ్లి..

బాలిక కదలికలను గమనిస్తున్న మహేంద్ర బైరాగీ(28) అనే స్థానిక యువకుడు.. ఆమె స్నానం చేస్తున్న సమయంలో బాత్రూమ్ లోకి చొచ్చుకెళ్లాడు.

కోట: స్నానం చేయడం కోసం బాత్రూమ్‌లోకి వెళ్లిన బాలికపై ఓ యువకుడు కన్నేశాడు. అమాంతం బాత్రూమ్‌లోకి చొచ్చుకుపోయి.. ఆమెను బలవంతం చేశాడు. చివరికి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టి అక్కడినుంచి పారిపోయాడు.

రాజస్థాన్ రాష్ట్రంలోని బరాన్ జిల్లా చబ్దా పట్టణంలో ఆదివారం నాడు ఈ ఘటన చోటు చేసుకుంది. చబ్దా పట్టణంలోని ఓ ఇంట్లో 15ఏళ్ల బాలిక స్నానం చేయడం కోసం బాత్రూమ్ లోకి వెళ్లింది. బాలిక కదలికలను గమనిస్తున్న మహేంద్ర బైరాగీ(28) అనే స్థానిక యువకుడు.. ఆమె స్నానం చేస్తున్న సమయంలో బాత్రూమ్ లోకి చొచ్చుకెళ్లాడు.

A 15-year-old girl was raped by a man at her house in Chabda town of Baran district on Sunday.

ఆమెపై అత్యాచారం జరిపి అక్కడినుంచి పరారయ్యాడు. ఘటనానంతరం బాధిత బాలిక తన తల్లితో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. నిందితుడు మహేంద్రబైరాగీపై ఫిర్యాదు చేయడంతో ఐపీసీ సెక్షన్ 376, పోస్కో చట్టాల కింద అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న తర్వాత.. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితుడు మహేంద్ర బైరాగీ కోసం పోలీసులు గాలిస్తున్నట్టుగా ఏఎస్ఐ రామ్ కరణ్ తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+