నమ్మించి తీసుకెళ్లి అమ్మాయిపై గ్యాంగ్ రేప్, తెలిసినవారే
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా 18 ఏళ్ల అమ్మాయిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. వారిద్దరు కూడా బాధితురాలికి తెలిసినవారే కావడం విశేషం. జన్మదిన వేడుకలను నిర్వహిస్తామని తీసుకుని వెళ్లి నిర్మానుష్యమైన ప్రదేశంలో ఆమెపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయని పోలీసులు శనివారంనాడు చెప్పారు.
ఇద్దరు వ్యక్తులపై సామూహిక అత్యాచారం కింద కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. బాధితురాలు ఆర్‌కె పురం పోలీసు స్టేషన్‌లో గత రాత్రి ఫిర్యాదు చేసింది. నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఓ ప్లేస్‌మెంట్ ఏజెన్సీ ద్వారా తనకు ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి వారిద్దరు తనతో స్నేహం చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

శుక్రవారంనాడు తన 18వ జన్మదినమని, ఈ సందర్భంగా వేడుకలు చేసుకుందామని తనను ఓ నిర్మానుష్యం ప్రదేశానికి తీసుకుని వెళ్లి తనపై అత్యాచారం చేశారని ఆమె ఆరోపించింది. అమ్మాయిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించారు.












Click it and Unblock the Notifications