బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Tehsildar: లంచం కేసులో జస్ట్ మిస్, ఉద్యోగానికి రాకుండా, కలెక్టర్ కు మెసేజ్ పంపించి జంప్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/మాగడి: ప్రభుత్వ ఉద్యోగం, అందులో పైసలు వచ్చే పోస్టు అయితే అలాంటి అధికారులకు రోజు పండుగే. లంచం తీసుకుంటున్న కేసులో తహసీల్దార్ ఏ 2 నిందితుడా ఉన్నాడు అలాంటి తహసీల్దార్ రెండు వారాల నుంచి మాయం కావడం కాలకలం రేపింది. లంచం తీసుకుంటున్న సమయంలో మధ్యవర్తి లోకాయుక్తకు చిక్కిపోవడంతో తహసిల్దార్ జంప్ అయ్యాడు.

Leader: బాలకృష్ణకు సినిమా చూపించిన పోలీసులు, అధికార పార్టీ అనుకుంటే ?, సీఐ కాలర్ పట్టుకుని !Leader: బాలకృష్ణకు సినిమా చూపించిన పోలీసులు, అధికార పార్టీ అనుకుంటే ?, సీఐ కాలర్ పట్టుకుని !

రెండు వారాల నుంచి కనిపించకుండా పోయిన రామనగర జిల్లాలోని మాగడి తహసిల్దార్ శ్రీనివాస్ ఇంతవరకు కనిపించకపోవడంతో ఆయన కుటుంబబ సభ్యులు ఆందడోళన చెందుతున్నారని తెలిసింది. కర్ణాటకలోని రామనగర జిల్లా మాగాడి తాలూకా తహశీల్దార్ శ్రీనివాస్ గత మూడేళ్లుగా పని చేస్తున్నారు. జనవరి 3వ తేదీ సాయంత్రం మాగాడి తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణలో మధ్యవర్తిగా పనిచేస్తున్న మంజునాథ్‌ ఓ భూమి కేసుకు సంబంధించి ఓ వ్యక్తి నుంచి రూ 20వేలు అడ్వాన్స్‌గా లంచం తీసుకుంటున్న సమయంలో లోకాయుక్త అధికారులు అతన్ని పట్టుకున్నారు.

 Tehsildar who has been on the run for two weeks fearing Lokayukta in bribery case in Karnataka.

ప్రభుత్వ భూమి కేసును మాగాడి తహసీల్దార్ కోర్టులో పరిష్కరిస్తామని మధ్యవర్తి మంజునాథ్ పిటిషనర్‌కు హామీ ఇచ్చారు. భూవివాదాన్ని పరిష్కరించుకోవాలంటే తహసీల్దార్‌ శ్రీనివాస్ సార్ కు లంచం ఇవ్వాలని మంజునాథ్ అతనికి చెప్పాడు. దీంతో బాధితుడు లోకాయుక్త అధికారులు సమాచారం ఇచ్చారు. జనవరి 3వ తేదీ సాయంత్రం తహశీల్దార్ శ్రీనివాస్ కార్యాలయం ఆవరణంలోనే లోకాయుక్త దాడులు చేశారు.

Wife: ఫామ్ హౌస్ లో భార్య మిడ్ నైట్ మసాల, అర్దరాత్రి అనుకోకుండా వెళ్లిన భర్త ?, అస్తిపంజరం ఎవరిది ?, క్లోజ్ !Wife: ఫామ్ హౌస్ లో భార్య మిడ్ నైట్ మసాల, అర్దరాత్రి అనుకోకుండా వెళ్లిన భర్త ?, అస్తిపంజరం ఎవరిది ?, క్లోజ్ !

తరువాత చాకచక్యంగా తప్పించుకున్న తహశీల్దార్ శ్రీనివాస్ రెండు వారాలు అయినా ఇంత వరకు కార్యాలయానికి రాకుండానే తప్పించుకుని తిరుగుతున్నాడని శుక్రవారం లోకాయుక్త అధికారులు తెలిపారు. లోకాయుక్త ఉచ్చులో పడిన నిందితుడు మంజునాథ్‌తోపాటు మాగాడి తహసీల్దార్ శ్రీనివాస్, ఆయనకు చాలా ఆప్తుడి మీద అధికారులు కేసు నమోదు చేశారు.

మంజునాథ్‌ అరెస్ట్‌ అయిన తరువాత తనకు సెలవు కావాలని తహశీల్దార్‌ శ్రీనివాస్ రామనగర జిల్లా మెజిస్ట్రేట్‌కు మెసేజ్‌ పంపించారు. తరువాత ఫోన్‌ స్విచ్ ఆఫ్ చేసిన తహసిల్దార్ శ్రీనివాస్ మాయం అయిపోయాడని అధికారులు అంటున్నారు. ప్రభుత్వ అధికారి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా లంచం కేసులో తప్పించుకుని తిరగడంతో లోకాయుక్త పోలీసులు సీరియస్ గా ఉన్నారని తెలిసింది.

English summary
Tehsildar who has been on the run for two weeks fearing Lokayukta in bribery case in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X