శత్రు దేశాలకు వణుకుపుట్టే నిర్ణయం తీసుకున్న కేంద్రం
న్యూఢిల్లీ: శత్రువుల మదిలో మరింత భయాన్ని పెంచేందుకు భారత్ సైన్యాన్ని మరింత పటిష్ఠం చేసేందుకు రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.2.23 లక్షల కోట్ల విలువ గల తేజస్ యుద్ధ విమానాలు, ప్రచండ్ హెలికాప్టర్ల కొనుగోలుకు కేంద్ర రక్షణ శాఖ ఆమోదం తెలిపింది.
భారత సాయుధ బలగాల కోసం 97 తేజస్ తేలికపాటి యుద్ధవిమానాలు, 156 ప్రచండ్ హెలికాప్టర్లను కొనుగోలుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. వీటి కొనుగోలుకు సుమారు రూ. 2.23 లక్షల కోట్లు అవుతున్నట్లు అంచనా. దీంతో పాటు వాయుసేనకు చెందిన సుఖోయ్-30 యుద్ధ విమానాలను అప్‌గ్రేడ్ ప్రోగ్రాంకు కూడా ఆమోదం తెలిపింది.

రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో సమావేశమైన డిఫెన్స్ అక్వైజిషన్ కౌన్సిల్(డీఏసీ) ఈ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసింది. ఈ రెండు రకాల విమానాలను 98 శాతం స్వదేశీ పరిజ్ఞానంతోనే అభివృద్ధి చేస్తున్నట్లు రక్షణశాఖ పేర్కొంది. అయితే తేజస్ మార్క్-1ఏ యుద్ధ విమానాలు వాయుసేన కోసం.. 156 హెలికాప్టర్లను వాయుసేన, ఇండియన్ ఆర్మీ అవసరాలకు కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది.
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL).. సుఖోయ్-30 యుద్ధ విమానాలను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది.2021లో రక్షణశాఖ.. వైమానిక దళం కోసం 83 తేజస్ మార్క్-1ఏ యుద్ధ విమానాల కొనుగోలుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు కొనుగోలు చేస్తున్న విమానాలతో కలుపుకుంటే తేజస్ యుద్ధ విమానాలు సంఖ్య 180 కు చేరుకోనుంది. దీంతో శత్రుదేశాలైన పాకిస్థాన్, చైనాలకు గట్టి హెచ్చరిక ఇచ్చినట్లవుతుంది.
-
యుద్ధం వేళ.. భారత్ కు అదానీ బిగ్ బూస్ట్.. 2 వేల మెషిన్ గన్ లు డెలివరీ.. -
3 ప్రభుత్వ బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. రూల్స్ బ్రేక్ చేస్తే ఊరుకునేదే లేదంటూ !! -
సరిహద్దుల్లేని వ్యాపారానికి సుంకాల బేడీలు? భారత్ పట్టు.. అమెరికాకు తలనొప్పి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా












Click it and Unblock the Notifications