Bihar: ఎన్డీఏ ఆధిక్యత సాధించిన వేళ.. తేజస్వీ యాదవ్ తొలి రియాక్షన్.. !!
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గెలుపోటముల మధ్య ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ కు అతీతంగా అన్ని పార్టీల అభ్యర్థుల్లోనూ గెలుపుపై ధీమా నెలకొంది. ఓటమిని ముందుగానే అంగీకరించడానికి ఎవరూ సిద్ధపడట్లేదు. ఈ నేపథ్యంలో భారీ విందుకు సన్నాహాలు జోరందుకున్నాయి. అన్ని పార్టీల అభ్యర్థుల నివాసాలు, పార్టీ కార్యాలయాలు నాయకులు, కార్యకర్తల కోలాహలంతో నిండిపోయాయి.
ప్రారంభ ఫలితాల్లో జనతాదళ్ (యునైటెడ్) భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి సునామీలా దూసుకెళ్తోంది. భారీ ఆధిక్యత సాధించింది. తొలి గంటలోనే ఆ కూటమి 100 సీట్ల మార్క్ ను అందుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎన్డీఏ సాధించే విజయం తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో తెలియజేస్తోంది. ఆయా స్థానాలన్నింట్లో కూడా ఎన్డీఏ అభ్యర్థులు భారీ మెజారిటీని సాధించారు. రాష్ట్రీయ జనతాదళ్- కాంగ్రెస్ అభ్యర్థులను వెనుకంజలో నెట్టారు.

అలీనగర్ నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థిని మైథిలీకుమార్ ఆధిక్యతలో కొనసాగుతున్నారు. బిప్లవ్ చౌదరి వెనుకంజలో ఉన్నారు. ప్రారంభ ఫలితాల్లో వెనుకపడ్డ తేజ్ ప్రతాప్ యాదవ్. సంజయ్ కుమార్ సింగ్ ఇక్కడ ఆధిక్యతలో కొనసాగుతున్నారు. మొకామాలో బాహుబలి అనంత్ సింగ్, తారాపూర్ లో సామ్రాట్ చౌదరి, దానాపూర్ లో కేంద్ర మాజీ మంత్రి కృపాల్ యాదవ్, బేతియాలో మాజీ డిప్యూటీ సీఎం రేణు దేవి.. తమ ప్రత్యర్థులపై భారీ ఆధిక్యత సాధించారు.
ఈ పరిణామాల మధ్య ప్రతిపక్ష నేత, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత తేజస్వీ యాదవ్ స్పందించారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. తాము గెలవబోతున్నామని తేల్చి చెప్పారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తోన్నానని అన్నారు. రాష్ట్ర అధికారంలో పెను మార్పు రాబోతోందని, చివరి వరకూ ఫలితాల కోసం ఎదురు చూడాలని సూచించారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని స్పష్టం చేశారు.
#WATCH | Patna: Bihar Assembly Election Results | Mahagathbandhan's CM face and RJD leader Tejashwi Yadav says, "We are going to win. Thanks to everyone. A change is about to come. We are forming the government" pic.twitter.com/p6pVag0e96
— ANI (@ANI) November 14, 2025
ఓట్ల లెక్కింపు ప్రారంభం కావడానికి కొద్ది నిమిషాల ముందు తేజస్వి యాదవ్ తన తండ్రి, పార్టీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్, సోదరి, లోక్‌సభ ఎంపీ మీసా భారతితో కలిసి పాట్నాలోని తన నివాసం వద్ద పార్టీ అభిమానులను కలుసుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన రాఘోపూర్ నుంచి తేజస్వి యాదవ్ పోటీ చేశారు. నితీష్ కుమార్ పరిపాలన పట్ల రాష్ట్ర ప్రజలు విసిగివేసారిపోయారేని, అందుకే మార్పు కోరుకుంటోన్నారని అన్నారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications