భారత్ వరకూ వచ్చేసిన వార్ ? తీరంలో ఇరాన్ నౌకను ముంచేసిన అమెరికా..!
పశ్చిమాసియాలో ఓవైపు ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య జోరుగా యుద్దం సాగుతున్న వేళ భారత్-శ్రీలంక తీరంలో ఇవాళ కలకలం రేగింది. ఇరాన్ కు చెందిన ఓ యుద్ధ నౌక (iran ship) ఉన్నట్లుండి శ్రీలంక తీరంలో మునిగిపోయింది. ఏపీలోని విశాఖపట్నానికి నేవీ డ్రిల్ కోసం వచ్చిన ఈ నౌక తిరుగు ప్రయాణంలో ఉండగా.. శ్రీలంక కోస్ట్ గార్డ్ కు ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమై కాపాడేలోపే అది సముద్రంలో మునిగిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 180 మందిని కాపాడేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి.
శ్రీలంకకు సమీపంలో హిందూ మహాసముద్రంలో ఇరాన్ యుద్ధనౌకను ఢీకొట్టింది అమెరికా జలాంతర్గామి అని తేలింది. ఇరాన్ నౌకను అమెరికా జలాంతర్గామి ఢీకొట్టి ముంచేసిన ఘటనలో కనీసం 80 మంది చనిపోయినట్లు నిర్ధారించారు. శ్రీలంక దక్షిణ తీరానికి సమీపంలో ఇరాన్ నౌకపై అమెరికా జలాంతర్గామి దాడి చేసిందని అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ ధృవీకరించిన తర్వాత ఈ ప్రకటన వెలువడింది. శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత హెరాత్ అంతకు ముందు పార్లమెంటుకు మౌడ్జ్-క్లాస్ ఫ్రిగేట్ ఐరిస్ దేనా ద్వీపం నుండి 40 నాటికల్ మైళ్ల దూరంలో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన తర్వాత ఇరాన్ నౌక కూలిపోయినప్పుడు అందులో దాదాపు 180 మంది ఉన్నారని చెప్పారు.

అయితే తామే ఈ దాడి చేసి ఇరాన్ నౌకను ముంచేసినట్లు అమెరికా రక్షణ కార్యదర్శి ప్రకటించారు. ఐరిన్స్ దేనా అనే ఈ నౌక తాజాగా విశాఖలో జరిగిన అంతర్జాతీయ నౌకాదళ రివ్యూలో పాల్గొని తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించింది. ఫిబ్రవరి 18 నుండి ఫిబ్రవరి 25 వరకు బంగాళాఖాతంలో జరిగిన నావికాదళ విన్యాసంలో ఇది పాల్గొంది. ఈ నౌక మునిగిపోయాక 32 మందిని రక్షించామని, సముద్రం నుండి అనేక మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని శ్రీలంక అధికారులు తెలిపారు. గాయపడిన వారికి దక్షిణ ఓడరేవు నగరం గాలేలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.












Click it and Unblock the Notifications