మీర‌ట్‌లో ఘోర ప్ర‌మాదం... మూడంత‌స్తుల భ‌వ‌నం కూలి ప‌దిమంది మృతి..

ఉత్తరప్రదేశ్‎లో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిన్న (శ‌నివారం) రాష్ట్రంలోని మీరట్‎లో మూడంత‌స్తుల భ‌వ‌నం ఒక్క‌సారిగా కుప్ప‌కూలడంతో 10 మంది ప్రాణాలు విడిచారు. ఈ ప్రమాద ఘ‌ట‌న‌లో శిథిలాలలో చిక్కుకున్న మొత్తం ప‌దిహేను మందిలో 14 మందిని బయటకు తీశారు. వీరిలో ప‌ది మంది మరణించిన‌ట్లు అధికారులు తెలిపారు.

ఈ విషాద సంఘ‌ట‌న మీరట్ నగరం జాకీర్ కాలనీలో చ‌విచూసింది. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్య్కూ టీమ్స్ వెంట‌నే సంఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేప‌ట్టారు. ఇంకా శిథిలాల కింద చిక్కుకుని ఉన్ వారిని కాపాడేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సంఘ‌ట‌న జ‌రిగిన ప్రాంతంలో వర్షం కురుస్తుండటంతో సహయక చర్యలకు ఆటంకం ఏర్పడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Terrible accident in Meerat 10 people died after three-storey building collapsed

ఇక‌, ఈ సంఘ‌ట‌న‌పై జిల్లా మేజిస్ట్రేట్ దీపక్ మీనా మీడియాతో మాట్లాడారు. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సంఘటనా స్థలంలో సహయక చర్యలు ముమ్మరంగా చేపడతున్నట్లు పేర్కొన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బ‌య‌ట‌కు తెచ్చేందుకు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌ని ఆయ‌న అన్నారు. ఇదిలా ఉండ‌గా, పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్ర‌క్రియ వేగ‌వంతం చేశారు.

లోహియా నగర్ ప్రాంతంలోని జాకీర్ కాలనీలో నిన్న ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వివ‌రించారు. ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన వారు 15 మంది ఉన్న‌ట్లు గుర్తించారు. ఈ ఇల్లు చాలా కాలం నాటిది కావడంతో ఇక్క‌డ నిరంతరం కురుస్తున్న భారీ వర్షాలకు కూలిపోయిన‌ట్లు అధికారులు చెబుతున్నారు. ఇంటి కింది అంతస్తులో ఒక డెయిరీని కూడా నిర్వహిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌లో పదుల సంఖ్యలో పశువులు కూడా శిథిలాల కింద కూరుకుపోయిన‌ట్లు అధికారులు వివ‌రించారు.

Terrible accident in Meerat 10 people died after three-storey building collapsed

స్పందించిన సీఎం..

ఈ ప్ర‌మాదంపై ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఈ ఘ‌ట‌న‌పై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాచారం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షత గ్రాతులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+