ఢిల్లీలో విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర?
దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరుతో వైభవంగా జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఉగ్రవాదులు భారీ విధ్వంసానికి పన్నిన కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అక్రంగా రవాణా చేస్తోన్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీసంఖ్యలో తూటాలను స్వాధీనం చేసుకున్నారు.
పంద్రాగస్టు వేళ దేశంలో ఎక్కడైనా ఉగ్రవాదులు దాడిచేయడానికి అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. దేశ రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఆనంద్ విహార్ ప్రాంతంలో సోదాలు చేస్తుండగా కొందరు వ్యక్తులు అనుమానాస్పందగా కనిపించడంతో పోలీసులు ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 2వేల తూటాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాలు స్మగ్లింగ్ చేస్తున్నారని, వారిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇటీవలే ఢిల్లీలోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు.

భారత గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవంతోపాటు ఇతర సందర్భాలను పురస్కరించుకొని ఉగ్రవాదాలు దాడులకు పాల్పడుతుండటం జరుగుతోంది. ఈసారి జరుగుతున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశానికి ఎంతో ప్రతిష్టాత్మకం కావడంతో, 75 సంవత్సరాలవడంలాంటి సందర్భాన్ని పురస్కరించుకొని ప్రజలంతా జండా పండగలో మునిగిపోయారు. ఎటువంటి అలసత్వానికి తావిచ్చినా ఉగ్రమూకలు దాడిచేయడం ఖామయనే అంచనాతో నిఘావర్గాలు ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రభుత్వానికి అందజేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలను కూడా అప్రమత్తం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications