Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Delivery boy: ఆల్ ఖైదాతో లింక్ లు, ఫుడ్ డెలవరీ పేరుతో జీహాద్ పోరాటం, ఆఫ్గానిస్తాన్ వెళ్లాలని ఇప్పుడు !

బెంగళూరు/గుహవాటి: ఫుడ్ డెలివరీ బాయ్ ఉద్యోగం చెయ్యాలంటే మెసేజ్ లు చదివి, అడ్రస్ లు తెలుసుకునే తెలివితేటలు ఉంటే చాలు ఉద్యోగం ఇచ్చేస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖ నగరాల్లో చదువుత సంబంధం లేకుండా లక్షలాది మంది ఫుడ్ డెలివరీ బాయ్స్ గా ఉద్యోగాలు చేస్తున్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదులతో లింక్ పెట్టుకుని ఫుడ్ డెలివరీబాయ్ అవతారం ఎత్తిని వ్యక్తి పోలీసులకు చిక్కడం కలకలం రేపింది. ఫుడ్ డెలివరీ దెబ్బతో మరో రాష్ట్రంలో మరో పోటుగాడు పోలీసులకు చిక్కాడు. ఇంతకాలం ఫుడ్ డెలివరీ బాయ్ ముసుగులో ఉన్న అనుమానిత ఉగ్రవాది అని తెలుసుకున్న సాటి ఫుడ్ డెలివరీ బాయ్స్ బిత్తరపోయారు.

ఎన్ఐఏ ఎంట్రీతో షాక్

ఎన్ఐఏ ఎంట్రీతో షాక్

అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాతో సంబంధాలున్న ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు బెంగళూరు నగరంలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది. అస్సాంకు చెందిన అక్తర్ హుస్సేన్ అలియాస్ అక్తర్ అలియాస్ హుస్సేన్, తమిళనాడులోని సేలంకు చెందిన అబ్దుల్ మండల్ అలియాస్ జుబాపై ఎన్ఐఏ అధికారులు ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.

అసోం నుంచి బెంగళూరు వచ్చి

అసోం నుంచి బెంగళూరు వచ్చి

ఫుడ్ డెలివరీ బాయ్ వేషంలో బెంగళూరులోని బీటీఎం లేఅవుట్‌లో తలదాచుకున్న అసోం చెందిన అక్తర్ హుస్సేన్‌ను2020 జులై 24వ తేదీన బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు పోలీసుల విచారణలో అక్తర్ హుస్సేన్ ఇచ్చిన సమాచారంతో అధికారులు హడలిపోయారు. ఫుడ్ డెలివరీ బాయ్ అక్తర్ హుస్సేన్ ఇచ్చిన సమాచారంతో తమిళనాడులోని సేలంలో అబ్దుల్ మండల్ పోలీసులకు చిక్కాడు.

ఆల్ ఖైదా ఉగ్రవాదులతో లింక్

ఆల్ ఖైదా ఉగ్రవాదులతో లింక్

నిందితులు అక్తర్ హుస్సేన్, అబ్దుల్ మండల్ ఇద్దరూ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా సభ్యుల రిక్రూట్‌మెంట్‌లో చురుగ్గా ఉన్నారని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఇద్దరి మీద బెంగళూరు నగరంలోని తిలక్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో అప్పట్లోనే కేసు నమోదు అయ్యింది. విషయం తెలుసుకున్న ఎన్ఐఏ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. ఎన్ఐఏ అధికారులు ప్రత్యేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేశారు.

జీహాద్ ప్రచారం

జీహాద్ ప్రచారం

అక్తర్ హుస్సేన్, అబ్దుల్ మండల్ అనే ఈ అనుమానిత ఉగ్రవాదులు ఆల్ ఖైదాలో చేరేందుకు ఆఫ్ఘనిస్తాన్‌కు వెళ్లేందుకు సిద్ధం అయ్యారని ఎన్ఐఏ అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో అల్ ఖైదా తీవ్రవాదులతో సంప్రదింపులు జరుపుతూనే ఉండేవాడు. పలు వెబ్‌సైట్‌లో జిహాద్ గురించి పోస్ట్ చేసి యువతను జీహాద్ వైపు తిప్పుకునేలా ప్రయత్నించారని వెలుగు చూసింది.

పిన్ టూ పిన్ బయటకు లాగుతున్న ఎన్ఐఏ !

పిన్ టూ పిన్ బయటకు లాగుతున్న ఎన్ఐఏ !

ఎన్‌ఐఏ విచారణలో వీరు జిహాద్‌లో పాల్గొనేలా యువకులను ప్రోత్సహిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. గురువారం బెంగళూరులోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో అక్తర్ హుస్సేన్, అబ్దుల్ మండల్ మీద ప్రత్యేక చార్జ్ షీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ అధికారులు మరింత లోతుగా ఇద్దరి గురించి పూర్తి సమాచారం బయటకు లాగుతున్నారని తెలిసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+