ఉగ్ర కలకలం : శ్రీనగర్ లో కొనసాగుతోన్న ఎన్ కౌంటర్

జమ్ము కశ్మీర్ : ఓవైపు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. మరోవైపు దాడులతో విరుచుకుపడుతున్న ఉగ్రవాదులు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా.. భారత భద్రతా బలగాలపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులు చేయడంతో.. ప్రస్తుతం శ్రీనగర్ పరిసర ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.

కాగా, కశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ జెండా ఆవిష్కరణ కోసం హాజరుకానున్న బక్షీ స్టేడియానికి సమీపంలోనే ఉగ్రమూకలు తెగబడడం కలవరపాటుకు గురిచేస్తోంది. నౌహట్టా ప్రాంతంలో రోడ్డుకు రెండు పక్కలా.. మాటు వేసి ఉన్న ఉగ్రవాదులు ఒక్కసారిగా సైన్యం మీదకు తెగబడ్డారు. దీంతో ఉగ్రవాదుల దాడిలో ఏడుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

Terrorists Open Fire On Security Forces

ఇదిలా ఉంటే.. ఉగ్రదాడికి కొద్ది నిమిషాల ముందు ఎర్రకోటలో జెండా ఆవిష్కరణ అనంతరం ప్రసంగించిన ప్రధాని మోడీ.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలా పాక్ చేస్తోన్న చర్యలను తప్పుబట్టారు. తక్షణం అలాంటి చర్యలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం శ్రీనగర్ లో ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతున్నట్లుగా సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+