Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి.. ముగ్గురు జవాన్లు మృతి, ఇద్దరు టెర్రరిస్టులు హతం!!

భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో సంబరాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉగ్రదాడులకు పాల్పడడానికి, పెద్ద ఎత్తున ఉగ్రవాదులు దేశవ్యాప్తంగా అనేక ముఖ్య నగరాలలో అశాంతిని రేకెత్తించటానికి ప్రయత్నం చేస్తారని ఇంటిలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో దేశవ్యాప్తంగా భద్రతా బలగాలు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ఇక తాజా పరిస్థితులతో జమూకాశ్మీర్ లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. జమ్మూకాశ్మీర్లో భద్రతను మరింత పెంచి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు అధికారులు.

జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీలో సైనిక శిబిరంపై ఉగ్రదాడి.. ముగ్గురు జవాన్లు మృతి

జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీలో సైనిక శిబిరంపై ఉగ్రదాడి.. ముగ్గురు జవాన్లు మృతి


భారత భద్రతా దళాలకు, టెర్రరిస్టులకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్న వేళ జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీలో సైనిక శిబిరంపై గురువారం నాడు తెల్లవారుజామున జరిగిన ఆత్మాహుతికి యత్నించిన ఉగ్రవాదులు చేసిన దాడిలో ముగ్గురు సైనికులు మరణించారు. మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఆర్మీ క్యాంపులోకి ప్రవేశించేందుకు టెర్రరిస్టులు ప్రయత్నించిన క్రమంలో జరిగిన దాడిలో ముగ్గురు జవాన్లు మృతి చెందగా, ఇద్దరు ఉగ్రవాదులను ఆర్మీ సిబ్బంది కాల్చిచంపారు. టెర్రరిస్టుల సూసైడ్ అటాక్ ను ఆర్మీ సిబ్బంది భగ్నం చేశారు.

 టెర్రరిస్ట్ లు కంచె దాటే యత్నం .. ఎదురుకాల్పులు.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

టెర్రరిస్ట్ లు కంచె దాటే యత్నం .. ఎదురుకాల్పులు.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

కొందరు ఉగ్రవాదులు పర్గల్ వద్ద ఆర్మీ క్యాంపు కంచెను దాటేందుకు ప్రయత్నించారని, సెంట్రీ వారిని సవాలు చేయడంతో ఎదురుకాల్పులు జరిగాయని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముఖేష్ సింగ్ తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లను కోల్పోయామని చెప్పారు. ఇక ఇద్దరు టెర్రరిస్ట్ లను హతమార్చినట్టు చెప్పారు. ఇక ఆ ప్రాంతంలో భద్రతను పటిష్టం చేయడానికి మరింత ఆర్మీ బలగాలను పంపించినట్లు గా ఆయన పేర్కొన్నారు. నేటి దాడికి లష్కరే తోయిబా లేదా ఎల్‌ఇటి ఉగ్రవాద సంస్థ హస్తం ఉండి ఉండవచ్చని పోలీసులు తెలిపారు.

30 కిలోల ఐఈడీ స్వాధీనం చేసుకున్న తర్వాత మరో ఘటన

30 కిలోల ఐఈడీ స్వాధీనం చేసుకున్న తర్వాత మరో ఘటన

రాజౌరి జిల్లా మరియు జమ్మూ కాశ్మీర్ లోని అనేక ప్రాంతాలలో చాలావరకు ఇటీవల కాలంలో టెర్రరిస్టుల వేట కొనసాగుతుంది. భద్రతా బలగాలు భారీగా రంగంలోకి దిగి టెర్రరిస్టులను ఏరివేస్తున్నారు. ఇక ఈ సమయంలో తాజాగా జరిగిన దాడి భద్రతా దళాలను మరోమారు అలర్ట్ చేసింది. కేంద్ర పాలిత ప్రాంతంలోని పుల్వామా జిల్లాలో 30 కిలోల ఐఈడీ పేలుడు పదార్థాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడం ద్వారా పెద్ద ఉగ్ర కుట్రను భగ్నం చేసిన ఒక రోజు తర్వాత ఈ దాడి జరిగింది.

2018 ఆర్మీ క్యాంప్ పై ఉగ్రదాడి తర్వాత పెద్ద ఉగ్ర దాడి ఇదే.. బాధతో ఒమర్ అబ్దుల్లా ట్వీట్

2018 ఆర్మీ క్యాంప్ పై ఉగ్రదాడి తర్వాత పెద్ద ఉగ్ర దాడి ఇదే.. బాధతో ఒమర్ అబ్దుల్లా ట్వీట్


జమ్మూ ప్రాంతంలోని సుంజ్వాన్ శిబిరంపై ఉగ్రవాదులు దాడి చేసిన ఫిబ్రవరి 2018 తర్వాత జమ్మూ కాశ్మీర్‌లోని ఆర్మీ క్యాంపు పై జరిగిన మొదటి అతిపెద్ద ఉగ్రవాద దాడి ఇది. రాజౌరిలో ఉగ్రవాదుల దాడిలో ముగ్గురు సైనికులు విధి నిర్వహణలో మరణించినందుకు చాలా చింతిస్తున్నాను. దాడిని ఖండిస్తూనే, దాడిలో గాయపడిన అధికారులు మరియు జవాన్లు త్వరగా కోలుకోవాలని నా ప్రార్ధనలు మరియు కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు..

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+