ఈ 7 ప్రాంతాలకు వెళ్తే మీ ప్రాణాలకు నో గ్యారంటీ: వార్నింగ్ ఇచ్చిన కేంద్రం..!!
Thailand-Combodia conflict: థాయ్ లాండ్- కాంబోడియా మధ్య సరిహద్దులో ఘర్షణలు తీవ్రతరం అయ్యాయి. యుద్ధవాతావరణం నెలకొంది. ఈ రెండు దేశాలు కూడా దాడులు- ప్రతిదాడులకు దిగాయి. ఈ ఘర్షణల్లో 15 మంది మరణించారు. వారిలో ఎక్కువ మంది సాధారణ పౌరులే.
ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో- సరిహద్దుల నుంచి ఈ రెండు దేశాలు కూడా పెద్ద ఎత్తున స్థానికులను తరలించాయి. ఇప్పటివరకు ఒక్క థాయ్ లాండ్ లోనే లక్ష మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారి కోసం దాదాపుగా 300లకు శిబిరాలను ఏర్పాటు చేశారు.

ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. ఈ మేరకు థాయ్ లాండ్‌లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. థాయ్- కాంబోడియన్ దళాల మధ్య జరుగుతున్న హింసాత్మక ఘర్షణల కారణంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడు ప్రావిన్సులకు వెళ్లొద్దని సూచించింది.
గురువారం ఇరు దేశాల సరిహద్దుల్లో తీవ్రస్థాయిలో ఘర్షణలు జరిగాయని, ఈ నేపథ్యంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని రాయబార కార్యాలయం హెచ్చరించింది. థాయ్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టింగ్ సర్వీస్ ప్రకారం, ఈ ఘర్షణల్లో కనీసం 15 మంది మరణించగా, 46 మంది గాయపడ్డారు.
భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా ఈ ప్రకటన విడుదల చేసింది. సిసుకేట్, సూరిన్, ఉబోన్ రచ్చాథాని, బురిరామ్, సా కాయెవ్, చంతబురి, ట్రాట్ ప్రావిన్స్ లకు ప్రయాణం చేయకపోవడం మంచిదని సూచించింది. తమ ప్రయాణాలను రద్దు లేదా వాయిదా వేసుకోవాలని కోరింది.
In view of the situation near Thailand-Cambodia border, all Indian travelers to Thailand are advised to check updates from Thai official sources, including TAT Newsroom.
— India in Thailand (@IndiainThailand) July 25, 2025
As per Tourism Authority of Thailand places mentioned in the following link are not recommended for… https://t.co/ToeHLSQUYi
ఈ ఏడు కూడా పర్యాటక ప్రాంతాలే. తరచూ భారతీయులు అక్కడికి వెళ్తుంటారు. ఇప్పుడు ఈ తాజా ఘర్షణల వల్ల ఆయా పర్యాటక ప్రదేశాలు తీవ్రంగా ప్రభావితం అయ్యే అవకాశం ఉందని రాయబార కార్యాలయం తెలిపింది. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు ఆయా ప్రాంతాల పర్యటనను విరమించుకోవాలని టూరిజం అథారిటీ ఆఫ్ థాయిలాండ్ సూచించింది.
థాయ్ లాండ్‌లో నివసిస్తోన్న భారతీయ పౌరులు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక అధికారులు ఇచ్చే సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేసింది. విపత్కర పరిస్థితులను ఎదుర్కొనాల్సి వస్తే అప్పటికప్పుడు తమను సంప్రదించాలని రాయబార కార్యాలయం సూచించింది. దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకు యుద్ధ ప్రభావిత ప్రాంతాలకు వెళ్లకూడదని పేర్కొంది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications