'థానే నరహంతకుడికి రూ. 67 లక్షల అప్పు ఉంది'

థానే: మహారాష్ట్రలోని థానేలో ఒకే కుటుంబంలోని 14 మందిని హతమార్చి ఆత్మహత్యకు పాల్పడ్డ హస్నెన్ అన్వర్ వారేకర్‌కి 67 లక్షల రూపాయల అప్పు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ కేసును ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

థానే దారుణం: అన్న అందర్నీ చంపేశాడు, సోదరి కంటతడి

ఈ దర్యాప్తులో హస్నెన్ అన్వర్ వారేకర్‌ వ్యాపారం చేస్తానంటూ సన్నిహితులు, బంధువుల నుంచి వరేకర్ అప్పులు తీసుకున్నట్టు గుర్తించారు. హత్యల అనంతరం ఆ నివాసంలో జరిపిన సోదాల్లో మానసిక రుగ్మతకు ఉపయోగించే మందులు లభ్యమయ్యాయని పోలీసులు చెప్పారు.

అయితే ఆ మందులు ఎక్కడ కొన్నారు? వాటిని సూచించిన వైద్యుడు ఎవరు? వంటి విషయాలపై దర్యాప్తు చేపట్టారు. కాగా, తల్లిదండ్రులు, అక్కాచెళ్లెళ్లు, భార్య, పిల్లలు, మేనకోడళ్లు, మేనల్లుళ్లు ఇలా ఆ ఇంట్లోని ఒక్క మహిళ మినహా మిగిలిన 14 మందిని వారేకర్ హత్య చేసిన సంగతి తెలిసిందే.

Thane mass murder : Warekar had debt of Rs 67 lakh, cops have no clue where money went

ఈ ఘటనలో గొంతు తెగిన ఓ మహిళ మాత్రమే ప్రాణాలతో బయటపడిందన్నారు. తీవ్ర గాయాలపాలైన ఆమె ప్రస్తుతం ఆసుుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పిల్లలు, కుటుంబ సభ్యులు హత్యకు గురికావడంతో షాక్ నుంచి ఆమె ఇంకా తేరుకోలేకపోతోందని పోలీసులు చెప్పారు.

14మంది కుటుంబ సభ్యులను చంపేసి, ఆత్మహత్య

ఈ సామూహిక హత్యా ఘటనకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. దీంతో అతని మానసిక స్థితిపైనా కూడా ఓ అంచనాకు వస్తామని చెప్పారు. షేర్ ట్రేడింగ్‌లో పాల్గొన్న వారేకర్ ఏదైనా నష్టాన్ని ఎదుర్కొన్నాడా లేదా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+