14మంది కుటుంబ సభ్యులను చంపేసి, ఆత్మహత్య

థానే: మహారాష్ట్రలోని థానేలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన కుటుంబంలోని పద్నాలుగు మందిని గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆదివారం ఉదయం వెలుగు చూసింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.

అతను చంపిన వారిలో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. ఆస్తి తగాదాల నేపథ్యంలోనే అతను ఇలాంటి దారుణం చేసి ఉంటాడని ప్రాథమికంగా భావిస్తున్నట్లు థానే పోలీస్ కమిషనర్ చెప్పారు. ఈ ఘటనలో గొంతు తెగిన ఓ మహిళ మాత్రమే ప్రాణాలతో బయటపడిందన్నారు.

Thane: Man allegedly kills 14 of his family, commits suicide

కిరాతకుడి బారి నుంచి ఓ మహిళ మాత్రం గాయాలతో బయటపడటంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలతో బయటపడిన మహిళ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, ఆమె కోలుకోగానే వివరాలు సేకరిస్తామని నగర పోలీస్ కమిషనర్ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+