థానే దారుణం: అన్న అందర్నీ చంపేశాడు, సోదరి కంటతడి
థానే: మహారాష్ట్రలోని థానేలో ఆదివారం ఉదయం 14 మంది కుటుంబ సభ్యులను హతమార్చి, తాను ఆత్మహత్య చేసుకున్న ఓ వ్యక్తి సంఘటన తెలిసిందే. నిందితుడి పేరు హస్నాని అన్వర్. ఈ ఘటనలో అతని సోదరి సుబినా బర్మాల్ గాయాలతో బయటపడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఈ ఘటనకు ఆస్తి తగాదాలేని పోలీసుల విచారణలో తేలింది. హస్నానీ తమ కుటుంబానికి చెందిన పురుషులను, మహిళలను, చిన్నారులను గొంతుకోసి హతమార్చాడు. వీళ్లందరికి మత్తు మందు వంటిది ఇచ్చిన తర్వాత ఈ ఘాతుకానికి అతను పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు. అతని చేతిలో సోదరి మాత్రం గాయాలతో బయడపడింది.
సోదరుడి చేతిలో గాయపడిని సుబినా స్పృహలోకి వచ్చింది. ఆమె ఇంకా షాక్ నుంచి పూర్తిగా బయటపడలేదు. తన అన్న అందరినీ చంపేశాడంటూ ఆమె ఏడుస్తూ చెప్పడం ఆసుపత్రిలో ఉన్న వారందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి.

నిందితుడు చంపిన వారిలో ఆ వ్యక్తి తల్లిదండ్రులు, కట్టుకున్న భార్య, పిల్లలు, అక్కచెల్లెళ్లు, మేనల్లుళ్లు, మేనకోడళ్లు ఇలా అందరినీ విందుకు పిలిచి మొత్తం కుటుంబ సభ్యులను 14 మందిని కిరాతకంగా హతమార్చి ఆత్మహత్య చేసుకున్నాడు.
తన సోదరుడు దాడి చేయడానికి కొంచెం ముందే తాను నిద్ర లేచానని, తనపై దాడి చేస్తున్న అతడిని తోసేసి గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నానని చెప్పింది. తన సోదరుడే అందర్నీ చంపేశాడని చెప్పింది. సుబియా పదే పదే తన ఆరు నెలల కూతురు అర్సియా గురించి అడుగుతోంది.












Click it and Unblock the Notifications