ఆరవ విడత పోలింగ్ ప్రారంభం -సీఎం యోగీ భవితవ్యం సైతం : పూర్వాంచల్ లో సత్తా చాటేనా..!!
రానున్న సార్వత్రిక ఎన్నికల ముందు సెమీస్ గా భావిస్తున్న ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. మొత్తం ఏడు విడతల్లో జరగాల్సిన ఉత్తర ప్రదేశ్ పోలింగ్ లో ఇప్పటికే అయిదు విడతల పోలింగ్ పూర్తయింది. ఈ రోజున ఆరో విడత పోలింగ్ ప్రారంభం అయింది. మొత్తం 10 జిల్లాల్లో 57 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. ఇందులో సీఎం యోగీతో సహా ఆయన కేబినెట్ ప్రముఖులు అదే విధంగా రాజకీయ కీలక నేతల భవితవ్యం ఈ విడత పోలింగ్ లో తేలనుంది. సీఎం యోగీ తొలి సారిగా అసెంబ్లీ బరిలో నిలిచారు. గోరఖ్ పూర్ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు.

తొలి సారి అసెంబ్లీ బరిలో యోగీ
అదే విధంగా కాంగ్రెస్ నేత అజయ్ కుమార్ నల్లే.. ఎస్పీ నేత స్వామి ప్రసాద్ మౌర్య బరిలో నిలిచారు. ఈ నెల 7వ తేదీన ఏడో విడత పోలింగ్ జరగనుంది. ఈ నెల 10వ తేదీన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ రోజు అంబేద్కర్ నగర్..బలరాంపూర్..సిద్దార్ద నగర్...బస్తీ..సంత్ కబీర్ నగర్...మహరాజ్ గంజ్..గోరఖ్ పూర్..ఖుషీ నగర్...డోరియా..బాలియా జిల్లాల్లో పోలింగ్ సాగుతోంది. గోరఖ్ పూర్ అర్బన్ నుంచి సీఎం యోగీ పోటీ చేస్తున్నారు. తముఖి రాజ్ నుంచి యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు లల్లూ బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి ఎస్పీలో చేరిన మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య ఫజిల్ నగర్ నుంచి పోటీలో ఉన్నారు. వీరితో పాటు రాష్ట్ర మంత్రుల్లో పలువురు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

మంత్రులు..కీలక నేతలు సైతం
మంత్రులు సూర్యప్రతాప్ షాహీ, సతీశ్ చంద్ర ద్వివేది, జైప్రతాప్ సింగ్, శ్రీరాం చౌహాన్, జైప్రకాశ్ నిషాద్ ఈ విడతలో బరిలో ఉన్నారు. ఆజాద్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు చంద్రశేఖర్ ఆజాద్.. గోరఖ్‌పుర్ అర్బన్ నియోజకవర్గం నుంచి యోగి ఆదిత్యనాథ్‌కు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు. ఈ రోజు పోలింగ్ జరుగుతున్న 57 స్థానాల్లో 11 స్థానాలు రిజర్వ్ సెగ్మెంట్లు ఉన్నాయి. కాగా, 2017 లో ఎన్నికలు జరిగిన ఈ 57 స్థానాల్లో బీజేపీ 46 స్థానాలు గెలుచుకుంది. భాజపా మిత్రపక్షాలైన అప్నాదళ్, నిషాద్.. ఇక్కడే ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. పూర్వాంచల్‌లో భాజపా మెరుగ్గా రాణించాలంటే ఈ రెండు పార్టీలు అధిక సీట్లను గెలుచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ రెండు పార్టీలకు భాజపా అధిక ప్రాధాన్యాన్ని ఇస్తోంది.

మిత్రపక్షాల బలమే ఇక్కడ కీలకం
మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి, యోగి కంచుకోట అయిన గోరఖ్‌పుర్ లోక్‌సభ స్థానాల్లోని నియోజకవర్గాలకు ఈ దశలోనే ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 2.14 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇప్పటి వరకు జరిగిన అయిదు విడతల పోలింగ్ పైన ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాశి.. యోగీ కంచుకోట గోరఖ్ పూర్ లో ఈ సారి వారిద్దరికీ వ్యక్తిగతంగా ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications