గుజరాత్ పై గురిపెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ; ఏప్రిల్ నుండి తిరంగా యాత్ర షురూ!!
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పేందుకు రెడీ అవుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ ఎన్నికల్లో ఇచ్చిన చారిత్రాత్మక విజయం తర్వాత ఈ సంవత్సరం డిసెంబర్ లో జరగనున్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ చేయడానికి రెడీ అయింది. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ, పంజాబ్ తర్వాత గుజరాత్ పై ఫోకస్ పెడుతున్నట్లుగా తెలుస్తుంది.
Recommended Video

ఏప్రిల్ నుండి గుజరాత్ రాష్ట్రంలో తిరంగా యాత్ర
గురువారం పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించిన తర్వాత పార్టీ కీలక నేతలు తమ నెక్స్ట్ టార్గెట్ గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు అని వెల్లడించడం ఆసక్తిని కలిగించింది. ఆపై ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ పై దృష్టి సారించిందని ఆ పార్టీ వెల్లడించింది. గుజరాత్ పై ఫోకస్ పెట్టడం లో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ నుండి గుజరాత్ రాష్ట్రంలో తిరంగా యాత్ర చేపట్టనుంది. మిషన్ గుజరాత్ కు శ్రీకారం చుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ తాము చేపడుతున్న తిరంగా యాత్ర గుజరాత్ లోని అన్ని జిల్లాలు, గ్రామ పంచాయతీలు, తహసిల్స్ ను చుట్టివచ్చేలా సాగుతుందని పేర్కొన్నారు.

గుజరాత్ లో కేజ్రీవాల్, భగవంత్ మాన్ పర్యటనకు ప్లాన్
ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ కాబోయే సీఎం భగవంత్ మాన్ త్వరలోనే గుజరాత్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. గుజరాత్‌లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) అత్యంత బలంగా ఉన్నందున, ఆప్ తన లక్ష్యాన్ని చేరుకోవడానికి వ్యూహాత్మకంగా వ్యవహరించనుంది. గుజరాత్ ఎన్నికలలో అధికారంలో ఉన్న బిజెపికి ప్రాథమిక ప్రతిపక్షంగా ఆవిర్భవించి, కాంగ్రెస్‌ను మూడో స్థానానికి నెట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నిస్తోంది.

గుజరాత్‌లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రధాన పోటీదారుగా బలపడే పనిలో ఆప్
ఆప్ గుజరాత్ ఇన్‌ఛార్జ్ గులాబ్ సింగ్ పంజాబ్ ఎన్నికల ఫలితం గుజరాత్‌లోని మా పార్టీ క్యాడర్‌ను ప్రేరేపించింది. గుజరాత్‌లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రధాన పోటీదారుగా ఎదగడానికి ఈ తొమ్మిది నెలల్లో అన్ని విధాలా కృషి చేస్తాం అని పేర్కొన్నారు. గత 27 ఏళ్లుగా కాంగ్రెస్‌ను గుజరాత్ ప్రజలు తిరస్కరించారు. కాంగ్రెస్ ను వెనక్కు నెట్టి ప్రధాన ప్రతిపక్షంగా పోరాటం చేయడానికి ప్రయత్నం చేస్తామన్నారు. పంజాబ్‌లో విజయం రాష్ట్రంలోని మా మద్దతుదారులకు కూడా కొత్త ఆశను కలిగిస్తుంది అని అన్నారు.

ఆప్ గుజరాత్ పై ఫోకస్ చెయ్యటం దేశ రాజకీయాల్లో ఆసక్తి
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 117 స్థానాలకు గాను 92 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇదే జోష్ తో గుజరాత్ ఎన్నికల పై దృష్టి సారించనుంది. పంజాబ్లో పాలక కాంగ్రెస్ కేవలం 18 స్థానాలకు పరిమితం కాగా, ఎన్డీఏ కూటమి నాలుగు స్థానాలను దక్కించుకుంది. ఏదేమైనా పంజాబీ ఎన్నికలలో గెలిచిన జోష్ తో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ రాష్ట్రం పై ఫోకస్ చేయడం దేశ రాజకీయాలలో ఆసక్తికర పరిణామం.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!












Click it and Unblock the Notifications