జైన మహార్షికి కరెంట్ షాక్ ఇచ్చి చంపేసి శవం ముక్కలుగా నరికేశారు. మ్యాటర్ !
బెంగళూరు/బెళగావి: కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని చిక్కోడి తాలూకాలోని హిరేకోడిలోని నందిపర్వత ఆశ్రమానికి చెందిన కామకుమార నంది మహారాజా జైన మునిని డబ్బు కోసం ఆక్ష్న ఆశ్రమంలోని భక్తులు హత్య చేశారని వెలుగు చూసింది. జైన ముని కామకుమార నంది మహారాజకు కరెంట్ షాక్ ఇఛ్చి చంపేశారని, తరువాత ఆయన శరీరాన్ని ముక్కలుగా నరికేసి శరీర భాగాలను వరి పొలంలోని పెద్ద పాడుబడిన బావిలో విసిరారని వెలుగు చూడటం కలకలం రేపింది.
ఈ విషయమై పూర్వాశ్రమంలోని జైన ముని బంధువు ప్రదీపా నందగావ్ ప్రముఖ కన్నడ టీవీ న్యూస్ చానల్ తో మాట్లాడుతూ వివరాలు చెప్పారు. హిరేకోడి ఆశ్రమంలో మునీశ్వరులు అయిన కామాకుమార నంది మహారాజ మునికి కరెంట్ షాక్ ఇచ్చి చంపేశారని ఆరోపించారు. అనంతరం జైన ముని మృతదేహాన్ని నరికి కటకబావి గ్రామంలోని ఓ పాడుపడిన బావిలో పడేశారని, ఈ విషయం గురించి లీసులు సమాచారం ఇవ్వడంతో మేము కూడా షాక్ అయ్యామని అన్నారు.

కామకుమార్ ముని అదృశ్యమైనప్పుడు ప్రధాన నిందితుడు మాతో కలిసి ముని కోసం వెతికాడని ప్రదీప చెప్పారు. జైన మహర్షిని హత్య చేసిన నిందితుడిని ఆశ్రమ భక్తుడైన మహదేవ్‌గా గుర్తించామని, అతని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాని జైన ముని సమీప బంధువు ప్రదీప అన్నారు. అలాగే ఆశ్రమానికి చెందిన కామకుమార ముని కనిపించకుండా పోయినప్పుడు ప్రధాన నిందితుడు మాతో కలిసి వెతికాడు.
ఆశ్రమం చుట్టూ ఉన్న చెరకు పొలాల చుట్టూ కామకుమార ముని తిరిగారని ఒక కట్టు కథ అల్లిన మహదేవ్ ఇటు ఆశ్రమం భక్తులు, పోలీసులకు తప్పుదోవ పట్టించాడని ప్రదీప ఆరోపించారు. మహదేవ్ మాయ మాటలను గమనించిన పోలీసులు అనుమానం వచ్చి అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. జైన మునికి కరెంట్ షాక్ ఇచ్చి చంపేశామని నిందితుడు అంగీకరించాడని పోలీసులు అన్నారు.
జైన మహర్షులను చంపిన వారిని శిక్షించాలని ఆశ్రమం భక్తులు డిమాండ్ చేస్తున్నారు. కామకుమార మహర్షులను చంపిన నిందితులకు తగిన శిక్ష విధించాలని జైన ముని బంధువు ప్రదీప డిమాండ్ చేశారు. కామకుమార ముని మృతదేహం లభ్యమైన తర్వాత ఆశ్రమంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని పూర్వాశ్రమం బంధువు ప్రదీప ప్రముఖ కన్నడ టీవీ చానల్ కు చెప్పారు.

జైన ముని కామకుమార్ హిరేకోడికి చెందిన నంది మహారాజును హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు చేసి ఖటకబావి గ్రామ పొలంలో పడేశారు. జైన మునిస్ మృతదేహం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు జేసీబీల సాయంతో జైన ముని శవం గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. ఖటకబావి - మొగలఖోడ రహదారి పక్కన ఉన్న పొలంలో జైన ముని మృతదేహం కోసం గాలిస్తున్నారు. ఖటకబావి బెళగావి జిల్లా కిందలో ఉంది.
జూలై 5 నుంచి అదృశ్యమైన ఆచార్య శ్రీ 108 కామకుమార్ నంది మహారాజు హిరేకోడిలోని నందిపర్వత ఆశ్రమం నుంచి అదృశ్యమయ్యారు. నిన్న మధ్యాహ్నం చిక్కోడి పోలీస్ స్టేషన్‌లో జైన ముని అదృశ్యంపై భక్తులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన నాలుగు గంటల్లోనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా జైన ముని హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వమని జైన మురి కోరినందుకే చంపేశారని నిందితులు చెప్పారని పోలీసులు అన్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications