అధికార పార్టీ ఎంపీ అనుచరుడిని వెంటాడి వెంటాడి లేపేశారు, మందుపార్టీలో కళ్లల్లో కారం చల్లి !
కర్ణాటక ఎంపీ ఉమేష్ జాదవ్ మద్దతుదారుడు దారుణ హత్యకు గురయ్యాడు. గిరీష్ చక్రా అలియాస్ చక్ర అనే వ్యక్తి దారుణ హత్యకు గురైన బీజేపీ నాయకుడు అని పోలీసులు తెలిపారు. కర్ణాటకలోని కలబురగి జిల్లా అఫజల్‌పూర్ తాలూకా సాగనూర్ గ్రామం శివార్లలోని పొలంలో గిరీష్ చక్రా దారుణ హత్యకు గురయ్యాడు. నాలుగు రోజుల క్రితమే కలబురగి బీఎస్‌ఎన్‌ఎల్ అడ్వైజరీ కమిటీ డైరెక్టర్‌గా బీజేపీ నాయకుడు గిరీష్ చక్రాను బీజేపీ ఎంపీ జాదవ్ నియమించారు.
అడ్వైజరీ కమిటీ డైరక్టర్‌గా నియమితుడు అయిన గిరీష్ అతని స్నేహితులకు మందు పార్టీ పెట్టేందుకు పొలానికి పిలిపించాడు. తరువాత స్నేహితులతో కలిసి బీజేపీ నాయకుడు గిరీష్ మందు పార్టీ కూడా చేసుకున్నాడని తెలిసింది. ఆ తరువాత బీజేపీ నాయకుడు, ఎంపీ ఉమేష్ జాదవ్ కు అత్యంత సన్నిహితుడు అయిన గిరీష్ అతని దారుణంగా హత్య చేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

అయితే బీజేపీ నాయకుడు గిరీష్ చక్రా హత్య జరిగి తీరును చూసు భయపడిపోయామని స్థానికులు చెబుతున్నారు. హత్యకు ముందు గిరీష్ కళ్లలో ఉప్పు, కారం పొడి చల్లి తరువాత అతన్ని పొలాల్లో వెంటాడి వెంటాడి హత్య చేశారని పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. గంగాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బీజేపీ నాయకుడు గిరీష్ చక్రా హత్య జరిగిందని పోలీసు అధికారులు తెలిపారు.
బీజేపీ ఎంపీ ఉమేష్ జాదవ్ ముఖ్య అనుచరుడు గిరీష్ చక్రా హత్య కేసులో నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. త్వరలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సందర్బంగా మరోసారి ఎంపీగా పోటీ చెయ్యాలని ఉమేష్ జాదవ్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఉమేష్ జాదవ్ కు పోటీగా బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో సిట్టింగ్ ఎంపీ ఉమేష్ జాదవ్ ముఖ్య అనుచరుడు గిరీష్ చక్రాను వెంటాడి వెంటాడి హత్య చెయ్యడంతో కలబురిగిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎంపీ అనుచరుడి హత్యతో కలబురిగిలో రాజకీయాలు వేడెక్కాయి.












Click it and Unblock the Notifications