Wife: ఇంట్లో ఉన్న భార్య మాయం, ట్రక్ టెర్మినల్ లో రేప్ చేసి గొంతు కోసి చంపేశారు. ఎలా బయటకు వెళ్లింది?
రాత్రి మొత్తం భార్య కోసం ఆమె భర్త వెతికాడు. బంధువులు, స్నేహితులు అందరికి ఫోన్లు చేసిన భర్త అతని భార్య గురించి ఆరా తీశాడు. మరుసటి రోజు ఉదయం లారీ డ్రైవర్లు హత్యకు గురైన మహిళ శవాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కటక్/ఒడిస్సా: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. దంపతులు హ్యాపీగా ఉన్నారని సమాచారం. ఉదయం భర్త బయటకు వెళ్లిపోతున్నాడు. ఉదయం బయటకు వెళ్లిన భర్త రాత్రి మాత్రమే ఇంటికి చేరుకుంటున్నాడు. ఎప్పటిలాగే భర్త బయటకు వెళ్లాడు. రాత్రి ఇంటికి వెళ్లిన భర్తకు అతని భార్య కనపడలేదు. రాత్రి మొత్తం భార్య కోసం ఆమె భర్త వెతికాడు.
బంధువులు, స్నేహితులు అందరికి ఫోన్లు చేసిన భర్త అతని భార్య గురించి ఆరా తీశాడు. అయితే మరుసటి రోజు ఉదయం లారీ డ్రైవర్లు మహిళ శవాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడం కలకలం రేపింది.

దంపతుల హ్యాపీలైఫ్
ఒడిస్సాలోని కటక్ లోని జగత్ పూర్ సమీపంలో మందన్ సాహు అలియాస్ మందన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం స్వరూపా (పేరు మార్చడం జరిగింది) అనే యువతిని మందన్ వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. మందన్, స్వరూపా దంపతులు ఇరు వైపుల కుటుంబ సభ్యుల ఇళ్లకు వెళ్లి అందరితో హ్యాపీగా ఉండేవారు.

ఇంట్లో ఉంటున్న భార్య
ఉదయం బయటకు వెళ్లిన మందన్ రాత్రి మాత్రమే ఇంటికి చేరుకుంటున్నాడు. ఉదయం నుంచి రాత్రి వరకు మందన్ భార్య స్వరూపా ఇంటిలోనే ఉంటున్నది. మందన్ కుటుంబ సభ్యులు వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఎప్పటిలాగే మందన్ మంగళవారం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి ఇంటికి వెళ్లిన మందన్ కు అతని భార్య కనపడలేదు. భార్య స్వరూపా ఫోన్ నెంబర్ కు ఫోన్ చేస్తే ఆమె మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది.

ట్రక్ టెర్మినల్ ప్రాంతంలో శవమైన భార్య
రాత్రి మొత్తం భార్య స్వరూపా కోసం మందన్ వెతికాడు. బంధువులు, స్నేహితులు అందరికి ఫోన్లు చేసిన తన భార్య స్వరూపా కనిపించడం లేదని, మీకు ఎమైనా తెలుసా అని మందన్ ఆరా తీశాడు. బుధవారం ఉదయంపప జగత్ పూర్ లోని ట్రక్ టెర్మినల్ ప్రాంతంలో మహిళ శవాన్ని గుర్తించిన లారీ డ్రైవర్లు జగత్ పూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

రేప్ చేసి గొంతు కోసి దారుణంగా చంపేశారు
కనపడకుండా పోయిన స్వరూపానే హత్యకు గురైయ్యిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. స్వరూపా మీద అత్యాచారం చేసి ఆమె గొంతు కోసి దారుణంగా హత్య చేశారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది. తన భార్యను ఎవరో హత్య చేశారని మందన్ పోలీసు కేసు పెట్టాడు. పోలీసుల ప్రాథమిక విచారణలో మందన్ భార్య మీద అత్యాచారం చేసి హత్య చేశారని వెలుగు చూసింది. అయితే మందన్ భార్య ఎందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లింది ?, ఆమెను ఎవరు పిలుచుకుని వెళ్లారు ?, రాత్రి ఎవరెవరు ఆ ప్రాంతంలో ఉన్నారు అని ఆరా తీస్తున్నామని, కేసు విచారణలో ఉందని జగత్ పూర్ పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications