Adipurush: ఆదిపురుష్ సినిమాకు ఎదురుదెబ్బు.. ఆగ్రహం వ్యక్తం చేసిన అలహాబాద్ కోర్టు..
ఆదిపురుష్ సినిమా విడుదలైన నుంచి వివాదాలకు కారణమవుతోంది. సినిమాలోని పాత్రలు అభ్యంతరకరంగా ఉన్నాయంటా హిందూ సంఘాలు ప్రశ్నించాయి. వెంటనే సినిమాపై నిషేధం విధించాలని డిమాండ్ చేశాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ హైకోర్టులోని లక్నో బెంచ్ ఆదిపురుష్ సినిమా నిర్మాతలపై అసహననం వ్యక్తం చేసింది. హిందూలు సహనాన్ని ఎందుకు పరీక్షిస్తారంటూ ప్రశ్నించింది.
ఇలాంటి సినిమాలు హిందువుల సహనాన్ని పరీక్షించేలా ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. సినిమాలో కీలక పాత్రలపై కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ కేసులో డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్‌కు నోటీసులు జారీ చేయాలని, అతడిని ఈ కేసులో పార్టీగా చేర్చాలని కోర్టు ఆదేశించింది. సినిమా ప్రదర్శనపై ఆంక్షలు విధించాలని కోరుతూ కుల్దీప్ తివారీ, నవీన్ ధావన్‌సీలు దాఖలు చేసిన రెండు పిల్‌లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

సినిమా రామాయణం ఆధారంగా తీసినది కాదని సినిమా డిస్‌క్లెయిమర్‌లో పేర్కొనడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. "రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, రావణుడు మొదలైనవారిని చిత్రనిర్మాత చూపించినప్పుడు, ఈ సినిమా కథ రామాయణమని ఎలా ఒప్పిస్తారు" అంటూ బెంచ్ తీవ్రంగా స్పందించింది. ఇది వాల్మీకి రామయణం కాదు, తులసీదాస్ రాసి రామచరిత మానస్ అంతకన్న కాదని వ్యాఖ్యానించింది.
సెన్సార్ బోర్డ్ మంజూరు చేసిన సర్టిఫికేట్‌ను సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందా లేదా అనే దానిపై వివరణ ఇవ్వాలని న్యాయమూర్తులు రాజేష్ సింగ్ చౌహాన్, ప్రకాష్ సింగ్‌లతో కూడిన వెకేషన్ బెంచ్ డిప్యూటీ సొలిసిటర్ జనరల్ SB పాండేని ఆదేశించారు. తదుపరి విచారణను ధర్మాసనం బుధవారానికి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications