వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘‘భేష్... ఇక ఆగొద్దు.. లాహోర్ లో మన త్రివర్ణ పతాకం ఎగరేయాలి..’’

నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యం చేసిన దాడులను పలు రాజకీయ పార్టీలు ప్రశంసించాయి. బీజేపీ మిత్రపక్షంగా ఉంటూనే ఇటీవలి కాలంలో కొంత దూరంగా కూడా ఉంటున్న శివసేన సైతం ఈ విషయంలో సైన్యానికి అండగా నిలిచింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యం చేసిన దాడులను పలు రాజకీయ పార్టీలు ప్రశంసించాయి. బీజేపీ మిత్రపక్షంగా ఉంటూనే ఇటీవలి కాలంలో కొంత దూరంగా కూడా ఉంటున్న శివసేన సైతం ఈ విషయంలో సైన్యానికి అండగా నిలిచింది.

'లేటుగా వచ్చినా లేటెస్టుగా వచ్చారు..' అంటూ శివసేన ప్రతినిధి అరవింద్ సావంత్ ప్రశంసించారు. ఇక ఇప్పుడు ఆగేందుకు సమయం లేదని, వెళ్లి లాహోర్ లో మన త్రివర్ణ పతాకాన్ని ఎగరేయాలని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంటే ఒక రకంగా పాకిస్తాన్‌ను ఆక్రమించాలనేది ఆయన మాటకు అర్థం.

కాంగ్రెస్ ప్రతినిధి ఆర్ఎస్ సుర్జేవాలా కూడా భారత సైన్యం చర్యలను ప్రశంసలతో ముంచెత్తారు. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాక్ శిబిరాలను ధ్వంసం చేయడంలో భారత సైన్యం చూపించిన అసమాన ధైర్య సాహసాలకు సెల్యూట్ అని ఆయన అన్నారు. ఈ శిబిరాల వల్లే పాకిస్తాన్ నుంచి చొరబాటుదారులు భారత భూభాగంలో ప్రవేశిస్తున్నారని ఆయన చెప్పారు.

The army should not stop until the Tiranga is hoisted in Lahore," Shiv Sena leader Arvind Sawant

మరోవైపు.. మే 9వ తేదీన, తర్వాత మళ్లీ 20, 21 తేదీలలో నిర్వహించిన ఈ దాడుల్లో ప్రధానంగా రాకెట్ లాంచర్లు, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైళ్లు, ఆటోమేటెడ్ గ్రనేడ్ లాంచర్లు, రికోయిలెస్ గన్‌లు ఉపయోగించినట్లు భారత సైన్యం తెలిపింది.

కౌంటర్ టెర్రరిజం వ్యూహంలో భాగంగా నియంత్రణ రేఖను పూర్తిగా డామినేట్ చేస్తోందని, ఉగ్రవాదులు చొరబాట్లకు పాల్పడే ప్రాంతాలను మనం టార్గెట్ చేసుకున్నామని ఆర్మీ ప్రతినిధి మేజర్ జనరల్ అశోక్ నరులా చెప్పారు. నియంత్రణ రేఖ వెంబడి చొరబాట్లు తగ్గాలని, తద్వారా జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదుల సంఖ్య తగ్గిస్తే అక్కడి యువత మీద దుష్ప్రభావాలు పడకుండా ఉంటాయని ఆయన అన్నారు.

English summary
The Shiv Sena on Tuesday lauded the 'punitive fire assault' on the Pakistan posts by the Indian Army in Jammu and Kashmir's Nowshera district saying that the army should now hoist the'Tiranga'(Indian Tricolour) in Lahore to a give befitting reply to the unprovoked ceasefire violations. "We do welcome this step by the Indian Army. Pakistan posts have been destroyed. Though it came late, but was strong. The army should not stop until the Tiranga is hoisted in Lahore," said Shiv Sena leader Arvind Sawant.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X