ముహూర్తం పెట్టిన మోదీ, షా, సైలెంట్ గా ఉండాలి, తోక తిప్పితే తోలు తీస్తారంట !
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల డేట్ ఫిక్స్ అయ్యింది. ఇప్పటికే ఎమ్మెల్యే టిక్కెట్లు ఆశపడుతున్న నాయకులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, అమ్ ఆద్మీ పార్టీ, జేడీఎస్ నాయకులు ఇప్పటికే కొన్ని నియోజక వర్గాల అభ్యర్థుల పేర్లు ప్రకటించేసింది. మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కూడా కేఆర్ పీ పార్టీ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేశారు.
అయితే కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం ఇంత వరకు ఆ పార్టీ అభ్యర్థుల ఒక్కపేరు కూడా ప్రకటించలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికి మరోసారి చాన్స్ వస్తుందని ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు. అయితే సీన్ రివర్స్ అవుతోందని తెలిసింది. చాలా మంది బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి చాన్స్ చిక్కే అవకాశం లేదని కొందరు బీజేపీ నాయకులు అంటున్నారు.

మిషన్ 150 టార్గెట్ పెట్టుకున్న బీజేపీ హైకమాండ్ గెలుపు గుర్రాలకు మాత్రమే టిక్కెట్లు ఇవ్వాలని, సీనియర్లు అని మోహమాటానికి పోయి అధికారం వదులుకోలేమని ఇప్పటికే బీజేపీ హైకమాండ్ కొందరు నాయకులకు తేల్చి చెప్పిందని తెలిసింది. కర్ణాటకలోని 224 నియోజక వర్గాల నాయకులతో మార్చి 31వ తేదీన బీజేపీ పెద్దలు సమావేశం నిర్వహిస్తున్నారు.
బెంగళూరులో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు అందరి అభిప్రాయాలు సేకరించి తరువాత అభ్యర్థుల పేర్లు ప్రకటించాలని బీజేపీ హైకమాండ్ సిద్దం అయ్యింది. ఏప్రిల్ 8వ తేదీన బీజేపీ హైకమాండ్ అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేస్తోందని, ఆ రోజు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు అభ్యర్థులను ప్రకటిస్తారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. టిక్కెట్లు దక్కని నాయకులు తిరుబాటు చెయ్యకుండా ముందుగానే కట్టడి చెయ్యాలని బీజేపీ హైకమాండ్ డిసైడ్ అయ్యిందని తెలిసింది. టిక్కెట్లు రాలేదని ఎవరైనా తోక తిప్పితే అసలు కథ మొదలౌతుందని తెలిసింది.












Click it and Unblock the Notifications