సాటిలేని లీడర్ గా యడియూరప్ప, మాజీ సీఎం ఫ్యామిలీ చేతిలోకి పవర్ మొత్తం, బీఎల్ కు షాక్ !
దక్షిణ భారతదేశంలో బీజేపీ వికసించడంలో బీఎస్ యడియూరప్ప కీలక పాత్ర పోషించారు. ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా, కరడుగట్టిన బీజేపీ కార్యకర్తగా కర్ణాటక రాష్ట్రంలో బీజేపీపై పూర్తి పట్టు సాధించారు. యడియూరప్ప దెబ్బకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సొంతపార్టీలోని ఆయన రాజకీయ ప్రత్యర్థి అయిన బీఎల్ సంతోష్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలిందా అనే ప్రశ్న తలెత్తుతోంది.
కర్ణాటకలో బీజేపీపై పూర్తి పట్టు సాధించేది బీఎస్ యడ్యూరప్పే అని అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప, ఆయన కుమారుడు, కర్ణాటక రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు బీవై విజయేంద్ర రాష్ట్ర బీజేపీ పదాదికారులుగా వారిని అనుచరులను నియమించుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. కర్ణాటక బీజేపీ శాఖ పూర్తిగా యడియూరప్ప కుటుంబ సభ్యుల చేతిలోకి వెళ్లిపోయిందని వెలుగు చూసింది.

యడియూప్ప శిష్యుల్లో చాలా మందిని, యడియూరప్ప మద్దతుదారులను కర్ణాటక బీజేపీ శాఖ పదవులు వరించాయి, ఈ దెబ్బతో కర్ణాటక రాష్ట్రంలో బీజేపీని యడియూరప్ప పూర్తిగా నియంత్రించినట్లు తెలుస్తోంది. కర్ణాటక బీజేపీ శాఖలో 10 మంది ఉపాధ్యక్షుల్లో మురుగేష్ నిరాణి, రాజుగౌడ్ నాయక్, హరతాలు హాలప్ప, బైరతి బసవరాజ్, ఎన్ మహేష్, ఎం రాజేంద్ర అనే ఆరు మంది బీఎస్ యడియూరప్ప అనుచరులే.
నలుగురు ప్రధాన కార్యదర్శుల్లో పి రాజీవ్, ప్రీతమ్ గౌడ్, నందీష్ రెడ్డి అనే ముగ్గురు బీఎస్ యడియూరప్ప అనుచరులు కావడం, బీజేపీలోకి యడియూరప్ప కాణంగా వీళ్లు అందరూ రావడంతో బీవై విజయేంద్ర వారికి పదవులు అప్పగించారు. కర్ణాటక బీజేపీ శాఖలో కొత్తగా నియమితులైన రాష్ట్ర బీజేపీ కార్యదర్శులు, వివిధ మోర్చాల అధ్యక్షుల్లో ఎక్కువ మంది మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్పకు గట్టి మద్దతుదారులేనని బీజేపీ వర్గాలు అంటున్నాయి.
రాష్ట్ర శాసనసభ, ఉభయ సభల్లో ప్రతిపక్ష నేత, ఉపనాయకుల నియామకంలో కూడా లింగాయత్‌లు ఎక్కువ మందికి పదవులు అప్పగించారు. శాసనసభలో ప్రతిపక్షనేత ఆర్.అశోక్, శాసనమండలి ఉపనేత సునీల్, శాసనమండలిలో ప్రతిపక్ష చీఫ్‌విప్ దొడ్డగౌడ పాటిల్, పరిషత్‌లో ఎన్.రవికుమార్ ఉన్నారని చెబుతున్నారు. యడ్యూరప్ప మిత్రులందరూ ఈ ఎంపిక వెనుక యడ్యూరప్ప, విజయేంద్రలకు బీజేపీ హైకమాండ్ పూర్తిగా ఫ్రీడమ్ ఇచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

రాష్ట్ర బీజేపీలో యడియూరప్ప వర్గానికి ఇంత ప్రాతినిధ్యం లభించడం ఇదే తొలిసారి. సీఎం హోదాలో బీఎస్ యడ్యూరప్ప పాపులారిటీలో తారాస్థాయిలో ఉన్నప్పుడు కూడా కర్ణాటకలో బీజేపీ కమిటీని అదుపు చేయలేకపోయారని బీజేపీకి చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే ఒకరు అంటున్నారు. పాపులారిటీలో కర్ణాటక బీజేపీలో యడ్యూరప్పకు సరిసమానమైన నాయకుడు లేక ఢిల్లీ స్థాయిలో హైకమాండ్ కూడా కర్ణాటకలో పట్టుసాధించలేకపోయిందని, ఇప్పుడు కర్ణాటక బీజేపీ యడియూరప్ప చేతిలోకి రావడానికి ఇందుకు కారణం అయ్యిందని బీజేపీ ఎమ్మెల్యే ఒకరు అన్నారు.
యడ్యూరప్పకు గతంలో ప్రత్యర్థి అయిన కేంద్ర మాజీ మంత్రి అనంత్‌కుమార్ కర్ణాటక రాష్ట్ర బీజేపీ శాఖలో అన్ని వర్గాలను బ్యాలెన్స్ చేశారు. తరువాత జగదీష్ శెట్టర్ కూడా కొంతమేర ఆ ప్రయత్నాలు పోషించారు. కానీ ఇప్పుడు అనంత్ కుమార్ చనిపోవడం, జగదీష్ శెట్టర్ కాంగ్రెస్ లోకి వెళ్లిపోవడంతో ఆ ఇద్దరూ బీజేపీలో లేరు. అయితే ఢిల్లీలోనే మకాం వేసిన బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ మాత్రం యడియూరప్పకు ఇంతకాలం ఏకుమేకైనారు. అయితే ఇప్పుడు తెరవెనుక యడ్యూరప్ప వ్యతిరేక శిబిరం ఒక్కటయ్యే అవకాశం ఉందని మరో ఎమ్మెల్యే అన్నారు.
ఇప్పుడు కర్ణాటక బీజేపీ శాఖ కమిటీ చూస్తే యడ్యూరప్ప వ్యతిరేక వర్గానికి మొండిచెయ్యి చిక్కింది. గతంలో యడియూరప్ప వర్గాన్ని బీజేపీ హైకమాండ్ ఫాలో కావడం వలనే ఇదే ఏడాది జరిరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పాలైయ్యింది. దెబ్బకు బీజేపీ హైకమాండ్ కు యడ్యూరప్ప సామర్థ్యంపై కొత్త విశ్వాసాన్ని కలిగించిందని బీజేపీ నాయకులు అంటున్నారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కర్ణాటక బీజేపీ శాఖను యడియూరప్ప చేతికి అప్పగించారు.












Click it and Unblock the Notifications