lady: అక్రమ సంబంధం, ప్రియుడి ఇంట్లో మకాం, ప్రియురాలికి షుగర్, ప్రియుడికి బీపీ, క్లైమాక్స్ లో ఏం చేశాడు !

పెళ్లి చేసుకోకుండానే అక్రమ సంబంధం పెట్టుకున్న ఇద్దరూ దంపతులు అని అందరికి మాయమాటలు చెప్పి ఒకే ఇంటిలో ఉంటున్నారు. అయితే పోలీసుల ఎంట్రీతో ప్రియుడి మ్యాటర్ మొత్తం బయటకు వచ్చింది.

బెంగళూరు: వివాహం చేసుకున్న మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తతో సంతోషంగా కాపురం చేస్తూ ఆమె సొంత ఊరిలోనే ఉండేది. భర్త చనిపోవడంతో ఆమె ఒంటరి అయ్యింది. ఇదే సమయంలో ఓ వ్యక్తి పరిచయం కావడంతో అతనితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది. పిల్లలను పుట్టింటిలో వదిలేసి ప్రియుడితో కలిసి ఐటీ హబ్ చేరుకుంది. పెళ్లి చేసుకోకుండానే అక్రమ సంబంధం పెట్టుకున్న ఇద్దరూ దంపతులు అని అందరికి మాయమాటలు చెప్పి ఒకే ఇంటిలో ఉంటున్నారు. ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న మహిళ చనిపోయింది. అనారోగ్యంతో ఆమె చనిచిపోందని ప్రియుడు అందర్ని నమ్మించాడు. అయితే పోలీసుల ఎంట్రీతో ప్రియుడి మ్యాటర్ మొత్తం బయటకు వచ్చింది.

భర్త చనిపోయాడు

భర్త చనిపోయాడు

పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముక్తా బర్మన్ (35) అనే మహిళకు బోదల్ అనే వ్యక్తితో వివాహం అయ్యింది. పశ్చిమ బెంగాల్ లోనే ముక్తా ఆమె భర్త బోదల్ తో కాపురం చేసింది. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త బోదల్ 15 ఏళ్ల క్రితం చనిపోయాడు. భర్త బోదల్ చనిపోయిన తరువాత ముక్తా ఆమె పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లింది. కొంతకాలం తరువాత ముక్తకు స్వపన్‌ బర్మన్‌ (47) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.

అక్రమ సంబంధం..... బెంగళూరు జంప్

అక్రమ సంబంధం..... బెంగళూరు జంప్

ముక్తా, స్వపన్ బర్మన్ ల మధ్య స్నేహం అక్రమ సంబంధానికి దారితీసింది. వివాహితుడైన స్వపన్ మదాడి తన పిల్లలను పశ్చిమ బెంగాల్‌లో వదిలి 9 ఏళ్ల క్రితం అతని ప్రియురాలు ముక్తాతో కలిసి బెంగళూరుకు వచ్చాడు. తరువాత దంపతులు అని ఇంటి యజమానిని నమ్మించిన ముక్తా, స్వపన్ బర్మన్ ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. అయితే ముక్తా, స్వపన్ బర్మన్ మాత్రం పెళ్లి చేసుకోకుండానే ఒకే ఇంటిలో ఎంజాయ్ చేస్తున్నాడు.

ప్రియురాలికి షుగర్

ప్రియురాలికి షుగర్

స్వపన్ బర్మన్ బెంగళూరులోనే ప్లంబర్‌గా పనిచేస్తున్నాడు. చాలా సంవత్రాల నుంచి స్వపన్ బర్మన్ ప్రియురాలు ముక్తా ఓ అపార్ట్‌మెంట్లలో హౌస్ కీపర్‌గా పనిచేస్తూ డబ్బులు సంపాధించింది. ప్రియుడి స్వపన్ తో కలిసి అతని ప్రియురాలు పశ్చిమ బెంగాల్ వెళ్లి అక్కడ కుటుంబ సభ్యులు, బంధువులతో కొన్ని రోజులు గడిపి మళ్లీ బెంగళూరు చేరుకునేది. మూడు సంవత్సరాల నుంచి ముక్తా షుగర్ వ్యాధితో బాధపడుతోంది.

ఉద్యోగం మానేసిన ప్రియురాలు

ఉద్యోగం మానేసిన ప్రియురాలు

మధుమేహం వ్యాధితో బాధపడుతున్న ముక్తా అలాగే ఉద్యోగానికి వెళ్లి వచ్చేది. ముక్తా ఆరోగ్యం ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులకు గురైయ్యింది. ప్రియుడు స్వపన్ బర్మన్ అతని ప్రియురాలు ముక్తాను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నాడు. ఇటీవల ముక్తా బర్మన్ ఆరోగ్యం క్షీణించడంతో ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉంటున్నది. స్వపన్ బర్మన్ ఫిబ్రవరి 7వ తేదీ అతని ప్రియురాలు ముక్తా బర్మన్‌ను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాడు. ముక్తాకు రక్తపరీక్షలు చేశారు. ఫిబ్రవరి 16వ తేదీన వచ్చి ఎంఆర్‌ఐ స్కాన్‌ చేయించుకోవాలని డాక్టర్‌ ముక్తాకు సూచించారు. తరువాత ముక్తా ను ఆమె ప్రియుడు ఇంటికి పిలుచుకుని వచ్చాడు.

నేను ఎక్కువ రోజులు బతకను

నేను ఎక్కువ రోజులు బతకను

బెంగళూరులోని వైట్ ఫీల్డ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హగదూర్‌లోనే చాలా సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన శిభాని మండల్ కుటుంబంతో ముక్తా, స్వపన్ బర్మన్‌లకు పరిచయం ఉంది. ఫిబ్రవరి 8వ తేదీ ఉదయం శిభాని మండల్‌ ఇంటికి ముక్తా, స్వపన్ వెళ్లారు. నా ఆరోగ్యం క్షీణించిందని, తాను ఎక్కువ రోజుల బతకను అని ముక్తా ఆమె స్నేహితురాలి ముందు బోరున విలపించిందని తెలిసింది. నువ్వు వెంటనే చికిత్స చేయించుకోవాలని, నీకు ఏమీ కాదని శిభాని మండల్‌ ముక్తాకు ధైర్యం చెప్పింది.

నాటకాలు ఆడిన ప్రియుడు

నాటకాలు ఆడిన ప్రియుడు

అదే రోజు సాయంత్రం శిషిభానీ ముక్తా బర్మన్ ఇంటికి వెళ్లినప్పుడు స్వపన్ బర్మన్ ఏడుస్తున్నాడు. చికిత్స ఫలించక ముక్తా మరణించిందని, మృతదేహాన్ని ఓ ప్రైవేట్ ఆస్పత్రి మార్చురీలో పెట్టామని స్వపన్ భర్మన్ చెప్పడంతో శిభాని మండల్ హడలిపోయింది. ఫిబ్రవరి 9న శిభాని మండల్‌, ఆమె భర్త సౌరవ్‌ ఘోష్‌ ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లారు. ఈ సమయంలో ముక్తా బర్మన్ అనారోగ్యంతో మృతి చెందిందని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ సమయంలో శిభాని మండల్‌ దంపతులు మార్చురీకి వెళ్లి ముక్తా మృతదేహం చూశారు. ముక్తా మెడ మీద గాయాలు ఉన్నట్లు గుర్తించి షాక్ అయ్యారు. దీనిపై స్వపన్ బర్మన్‌ను శిభాని మండల్ దంపతులు ప్రశ్నించారు.

ప్రియుడే హంతకుడు

ప్రియుడే హంతకుడు

స్వపన్ బర్మన్ పొంతనలేకుండా సమాధానాలు చెప్పడం, అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లాలని ప్రయత్నించడంతో అనుమానం వచ్చ శిభాని మండల్‌ నిందితుడి గురించి వైట్‌ఫీల్డ్‌ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు స్వపన్ బర్మన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా ముక్తా పదేపదే అనారోగ్యానికి గురౌతుందని, ఆమెకు చికిత్స చేయించలేక తాను ఆమె నోటిలో బట్టలు కుక్కి గొంతునులిమి హత్య చేశానని అంగీకరించాడని పోలీసు అధికారులు తెలిపారు. 9 సంవత్సరాల అక్రమ సంబంధం పెట్టుకుని సహజీవనం చేస్తున్న ముక్తా చివరికి ఆమె ప్రియుడి చేతిలోనే హత్యకు గురైయ్యిందని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+