ప్రియురాలిని చంపేసి శవాన్ని ఏం చేశాడంటే ?, భర్తను వదిలేసిన ఆంటీ మీద మోజుతో ఇలా !
వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. భర్తతో కాపురం చేస్తున్న మహిళకు గొడవలు మొదలైనాయి. దంపతుల మధ్య పదేపదే గొడవలు ఎక్కువ అయ్యాయి. భర్తకు చెప్పాపెట్టకుండా భార్య బయట తిరగడం మొదలుపెట్టింది. దంపతులు విడిపోయారు. భర్తతో విడిపోయి ప్రియుడితో జల్సా చేస్తున్న మహిళ దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది.
కర్ణాటకలోని చిక్కబళ్లాపురం పట్టణం (ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లా)లోని వార్డు నెంబర్ 29లోని చామరాజపేటలోని రైల్వే స్టేషన్ మెయిన్ రోడ్డులో దీపా అలియాస్ దీపాంజలి (42) అనే మహిళ నివాసం ఉంటున్నది. గత ఏడాది దీపా, దివాకర్ అనే వ్యక్తి ఇంటి యజమానికి దగ్గరకు వెళ్లి తాము దంపతులు అని పరిచయం చేసుకున్నారు. మేము నివాసం ఉండటానికి ఇల్లు అద్దెకు కావాలని చెప్పారు.

ఇంటి యజమాని చెప్పిన అడ్వాన్స్ ఇచ్చిన దీపా ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటోంది. దీపాతో పాటు దివాకర్ కూడా అదే ఇంటిలో నివాసం ఉంటున్నాడు. ప్రతిరోజు దివాకర్, దీపా బయటకు వెళ్లి వస్తున్నారు. ఫిబ్రవరి 7వ తేదీన దీపా, దివాకర్ ఇంటి నుంచి బయటకు వెళ్లి వచ్చారు. తరువాత దీపా చుట్టుపక్కల వారికి ఎవ్వరికి కనపడలేదు. ఇదే సమయంలో దివాకర్ కూడా మాయం అయ్యాడు.
దీపా ఇంటి నుంచి దుర్వాసన రావడం ఎక్కువ అయ్యింది. ఆదివారం రాత్రి దీపా ఇంటి చుట్టుపక్కల ఉంటున్న వాళ్లు, ఆ ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు. చిక్కబళ్లాపురం పట్టణ పోలీసులు దీపా ఇంటికి వెళ్లి తలుపులు పగలగొట్టి చూశారు. ఇంటి లోపల దీపా శవమై కనిపించడంతో ఇంటి యజమానితో పాటు స్థానికులు హడలిపోయారు. దీపాతో పాటు అదే ఇంటిలో ఉండే దివాకర్ కూడా మాయం అయ్యాడు.













Click it and Unblock the Notifications