బంగారం పెట్టలేదని అలిగిన వరుడు.. దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన వధువు..
కొంత మంది పెళ్లి కొడుకులు తమకు బంగారం పెట్టలేదనో లేక బండి కొనివ్వలేదనో అలిగి వెళ్లిపోతుంటారు. కొద్ద రోజుల క్రితం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో ఓ పెళ్లి కొడుకు బండి కొనివ్వలేదని అలిగాడు. పెళ్లి పెద్దలు ఎంత చెప్పిన అతను వినలేదు. దీంతో పెళ్లి హాజరైన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బండి కొనిస్తా అని వరుడికి చెప్పడంతో పెళ్లి జరిగింది. పెళ్లి అనంతరం వరుడికి ఎమ్మెల్యే బండి కూడా కొనిచ్చాడు.
తాజాగా ఉత్తర ప్రదేశ్ లో కూడా ఇలాంటి ఘటనే జరగింది. కానీ పెళ్లి కూతురు మాత్రం అత్తారింటికి వెళ్లేది లేదని తెగేసి చెప్పింది. ఉత్తర ప్రదేశ్ లోని అడమ్ గడ్ జిల్లా ఆలమ్‌పురిలో ఓ పెళ్లి జరిగింది. అయితే వధువు తరుపువారు పెళ్లి కొడుకు ఉంగరం, గొలుసు పెడతామని పెట్టలేదు. దీంతో వరుడు అలిగాడు. ఎవరితో చెప్పకుండా పెళ్లి మండలం బయటకు వచ్చాడు. అతనితో పాటు వధువు కూడా వచ్చింది. ఇద్దరు కలిసి కారు ఎక్కి ఇంటికి బయల్దేరు.

అయితే కొంత దూరం వెళ్లిన తర్వాత కారు రివర్స్ తీసుకుని పెళ్లి కూతురు ఇంటికి వచ్చారు. తనకు ఉంగరం, గొలుసు కావాలని తేల్చి చెప్పాడు.తమ వద్ద ఆర్థిక స్తోమత లేదని.. కొద్ది రోజుల తర్వాత బంగారం పెడతామని చెప్పారు. అయినా పెళ్లి కొడుకు వినలేదు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తాను అత్తారింటికి వెళేది లేదని వధువు తేల్చి చెప్పింది. కట్నం కోసం అలా చేస్తే తర్వాత తనను ఎంత ఇబ్బంది పెడతారో అందుకే వెళ్లను అని చెప్పింది.
దీంతో అమ్మాయి తరుఫు వారు పెళ్లికొడుకును, అతని తల్లదండ్రలను తాడుతో కట్టేశారు. పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో ఏం కట్నకానుకలు పెట్టారో అవన్ని తిరిగిచ్చారు. పెళ్లికి అయిన రూ.90వేలను అబ్బాయి నుంచి వసూలు చేశారు. దీంతో పెళ్లి కుమారుడు, అతని తల్లిదండ్రులు వెళ్లిపోయారు. చూశారుగా.. కట్నం కోసం ఎక్కువ చేస్తే ఏమవుతుందో..












Click it and Unblock the Notifications