ఇంజనీర్ భార్య హత్య కేసులో ట్విస్ట్, ఆంటీని చంపింది అందుకే !
బెంగళూరు/శివమొగ్గ: కర్ణాటకలోని శివమొగ్గ నగరంలో ఇంజనీర్ మల్లికార్జున్ భార్య కమలమ్మ అలియాస్ (50) హత్యకేసులో ఇంజనీర్ కారు డ్రైవర్ సహా 7 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు నిందితులు 41,14,800 డబ్బు, రూ. 33.74 నగదు, ఒక కారు, రెండు బైక్‌లు సహా వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. హత్య కోసం ఉపయోగించిన ఏడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని శివమొగ్గ జిల్లా ఎస్పీ జీకే. మిథున్ కుమార్ తెలిపారు.
విలేకరుల సమావేశంలో ఎస్పీ మిథున్ కుమార్ వివరాలు వెళ్లడించారు. హుణసోడు తండాకు చెందిన హనుమంత నాయక్ (22) పీడబ్ల్యూడీ శాఖలో పని చేస్తున్న ఇంజనీర్ మల్లికార్జున్ ఇంట్లో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మల్లికార్జున్ బెంగళూరులో ఎంబీబీఎస్ చదువుతున్న అతని కుమారుడి వైద్య విద్యకు ఫీజు కట్టేందుకు స్నేహితుల వద్ద రూ. 35 లక్షలు అప్పుగా తీసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. ఈ డబ్బులన్నీ డ్రైవర్ హనుమంత్ నాయక్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు.

దీంతో హనుమంత్ నాయక్ తన స్నేహితులతో కలిసి ఈ డబ్బును స్వాహా చేయాలనే ఉద్దేశంతో కుట్ర పన్నినట్లు సమాచారం. ఈ చర్యలో హనుమంత్ నాయక్ తో పాటు అతని స్నేహితులు గుండప్ప షెడ్‌కు చెందిన ప్రదీప్, అనుపినకట్టెతండాకు చెందిన అప్పునాయక్, గుండప్ప షెడ్‌కు చెందిన యానె అప్పు, సతీష్, అనుపినకట్టెతండాకు చెందిన రాజులతో కలిసి ఇంజనీర్ మల్లికార్జున్ భార్య కమలమ్మ అలియాస్ కమలను హత్య చేశారని ఎస్పీ మిథున్ కుమార్ తెలిపారు.
ఈ హత్య కోసం కారును ఇచ్చిన కౌశిక్‌ను అరెస్టు చేసినట్లు ఎస్సీ మిథున్ కుమార్ తెలిపారు. ఇంజనీర్ మల్లికార్జున్ గోవాకు వెళ్లడాన్ని గమనించిన డ్రైవర్ హనుమంత్ నాయక్ జూన్ 16వ తేదీ రాత్రి అతని ఇంటికి వెళ్లి కమలమ్మను తన సోదరుడి వైద్యం కోసం రూ. 2 వేలు డబ్బులు అడిగాడు. ఆ సందర్భంలో డబ్బులు ఇవ్వడానికి నిరాకరించిన కమలమ్మ మరుసటి రోజు రావాలని చెప్పారు.
మరుసటి రోజు హనుమంత నాయక్ అతని స్నేహితులు ప్రదీష్, అప్పునాయక్ ఇంటికి వెళ్లి వైద్యం కోసం డబ్బులు అడిగాడు. అప్పుడు కమలమ్మ డబ్బులు ఇవ్వడానికి నిరాకరించింది. మీ సార్ గోవా నుంచి ఊరికి వచ్చిన తరువాత డబ్బులు తీసుకోవాలని కమలమ్మ డ్రైవర్ హనుమంత్ నాయక్ కు చెప్పింది. ఆ సమయంలో తాగేందుకు నీళ్లు కావాలని హనుమంత నాయక్ కమలమ్మకు చెప్పాడు.

నీళ్లు తీసుకురావడానికి కమలమ్మ ఇంటి లోపలికి వెళ్లగా ఆమె వెనుకే అప్పు నాయక్ వెళ్లి ఆమె నోరు నొక్కే ప్రయత్నం చేయగా కమలమ్మ ప్రతిఘటించింది. ఆపై పదునైన ఇనుప రాడ్‌తో కమలమ్మ తల, మెడపై కొట్టి హత్య చేశారు. కమలమ్మను హత్య చేసిన తరువాత బీరాలో ఉన్న రూ. 35 లక్షలు డబ్బులు తీసుకున్న తర్వాత నిందితులు అందరూ అక్కడి నుంచి పారిపోయారు. శివమొగ్గలో జరిగిన కమలమ్మ హత్య కేసు కలకలం రేపడంతో పోలీసులు ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చేసి నిందితులను చాకచక్యంగా అరెస్టు చేశారు.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications