లేడీస్ పీజీలో ఎలా చంపాడంటే, సీసీటీవీ క్లిప్పింగ్స్ వైరల్, కసాయి బాయ్ ఫ్రెండ్
బెంగళూరు నగరంలోని కోరమంగళకు చెందిన కృతి కుమారి లైవ్ మర్డర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిందితుడు అభిషేక్ నేరుగా లేడీస్ పీజీలోకి వెళ్లి అక్కడే ఉంటున్న కృతి కుమారిని హత్య చేస్తూ సీసీటీవీలో చిక్కిపోయాడు.
బెంగళూరులోని కోరమంగళలోని ఓ పీజీలో జూన్ 23వ తేదీన కృతి కుమారి దారుణ హత్యకు గురైంది.
రాత్రి 11.13 గంటలకు నిందితుడు అభిషేక్ లేడీస్ పీజీకి వచ్చి కృతి కుమారి గది తలుపు తట్టాడు. ఆ సమయంలో కృతి కుమారి తలుపు తీస్తుండగా ఆమెను కత్తితో పొడిచేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో కృతి కుమారి తప్పించుకునేందుకు ప్రయత్నించగా ఆమెను వదలకుండా పలుమార్లు కత్తితో పొడిచి, ఆమె పీకకోసి అతి దారుణంగా హత్య చేశాడు. ప్రస్తుతం కోరమంగళ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు అభిషేక్ కోసం గాలిస్తున్నారు.

హత్య అనంతరం నిందితుడు అభిషేక్ బట్టలు మార్చుకుని బెంగళూరు సిటీ దాటి చాకచక్యంగా పారిపోయాడు. అభిషేక్ భోపాల్‌కు పారిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం నిందితుడు అభిషేక్ ను అరెస్ట్ చేసేందుకు కోరమంగళ పోలీసులు భోపాల్ వెళ్లారు.రెండు నిమిషాల్లోనే కృతి కుమారిని హత్య చేసే దృశ్యాలు సీసీటీవీలో చిక్కాయి. నిందితుడు అభిషేక్ లేడీస్ పీజీ గేటులోకి ప్రవేశించి తరువాత మూడో అంతస్తు మీదకు వెళ్లి కృతి కుమారి ఉంటున్న గది తలుపు తట్టాడు.
కృతి కుమారి రూమ్ లో నుంచి బయటకు వచ్చి చూడగానే ఆమె జుట్టు పట్టుకుని కత్తితో పొడిచేందుకు ప్రయత్నించాడు. అప్పుడు కృతి కుమారి సహాయం కోసం కేకలు వేసింది. అయితే నిందితుడు అభిషేక్ చేతిలో కత్తి ఉండడంతో అదే లేడీస్ పీజీలో ఉంటున్న సాటి యువతులు ఎవర్వూ కుమారికి సాయం చేసేందుకు రాలేదు. అయితే ఆ కృతి కుమారి తన ప్రాణాలను కాపాడుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయితే బలంగా శారీరకంగా ఉన్న నిందితులు అభిషేక్ మాత్రం కృతి కుమారిని కత్తితో దారుణంగా ఇష్టం వచ్చినట్లు పొడిచాడు.

నొప్పితో కొట్టుమిట్టాడుతున్న కృతి కుమారి మెడను మూడు నాలుగు సార్లు కోసేశాడు. అభిషేక్ నుంచి తనను తాను రక్షించుకోవడానికి కృతి కుమారి ప్రతిఘటించడంతో, ఆమె నోటి నుండి మాటకూడా బయటకు రాలేదు. కృతి కుమారి మెడ తెగిపోయి రక్తం కారింది. ఆమె మరణించిందని నిర్దారించుకున్న తర్వాత కృతి కుమారిని అక్కడే వదిలేసిన అభిషేక్ అక్కడి నుండి పారిపోతున్న దృశ్యాలు కూడా సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.
కృతి కుమారిని కేవలం రెండు నిమిషాల్లో హత్య చేసిన నిందితుడు అభిషేక్ అక్కడి నుంచి పరారయ్యాడు. కృతి కుమారి మెడ, ఛాతీ, పొత్తికడుపు సహా పలుచోట్ల కత్తితో పొడిచాడు. కృతి కుమారి తన ప్రాణాలను కాపాడుకోవడానికి చాలా కష్టపడి చివరికి విఫలం అయ్యింది. రక్తపు మడుగులో ఉన్న కృతి కుమారి తన ప్రాణాలు కాపాడుకోవడానికి నన్ను కాపాడాలని గట్టిగా కేకలు వేసినా ఆమెకు సహాయం అందించడానికి అదే పీజీలో ఉన్న ముగ్గురు యువతులు ధైర్యం చెయ్యలేక ఆమె దగ్గరికి వెళ్లడానికి భయపడిపోయారని పోలీసులు అంటున్నారు.

కృతి కుమారి నివాసం ఉంటున్న లేడీస్ పీజీలో ఉన్న యువతులు మాత్రం అక్షరాలా మానవత్వం మరిచిపోయినట్లు ప్రవర్తించారని పోలీసులు సైతం విచారం వ్యక్తం చేస్తున్నారు. చివరికి ఆ యువతులు అంబులెన్స్‌కి ఫోన్ చేసి కృతి కుమారి ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఇవేమీ చేయకుండా మొబైల్ ఫోన్లు చేతిలో పట్టుకుని నిలబడిపోయారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
రక్తస్రావం కావడంతో కృతి కుమారిని చేత్తో తనను రక్షించాలంటూ ఫోన్ లు చేస్తున్న యువతులను చూసి వేడుకుంటున్నా ఆ యువతులు ఫోన్లలో మాట్లాడుకుంటూ మెట్లపై నుంచి కిందకు దిగుతూ వెళ్లిపోయారని, పీజీలోని యువతులు కనికరం లేకుండా ప్రవర్తించారని, భయంతో యువతులు ఏమీ చేయకుండా కృతి కుమారిని చూస్తూ నిలబడని దృశ్యాలన్నీ పీజీలోని సీసీటీవీలో రికార్డు అయ్యాయని పోలీసులు అంటున్నారు. బెంగళూరు పోలీసులు భోపాల్ చేరుకుని హంతకుడు అబిషేక్ కోసం గాలిస్తున్నారు.
-
రేపే ఐపీఎల్ ఓపెనర్: మెట్రో రైల్ లో ఫ్రీ ట్రావెల్: మంత్రులకూ -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications