PBBY: విదేశాలకు వెళ్లిన భారతీయులకు కోసం ప్రత్యేక బీమా పథకం..
కువైట్‌లోని ఆరు అంతస్తుల భవనంలో సంభవించిన అగ్నిప్రమాదంలో సుమారు 40 మంది భారతీయ వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది గాయపడినట్లు సమాచారం. మృతుల కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాను ప్రధాని ప్రకటించారు. భారతీయ వలస భారతీయ కార్మికుల కోసం ఓ పథకాన్ని తీసుకొచ్చింది.
అదే ప్రవాసీ భారతీయ బీమా యోజన పథకం. ఈ బీమా తీసుకున్న వారు ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత వైకల్యం పొందినప్పుడు రూ. 10 లక్షల మొత్తాన్ని అందిస్తారు. PBBY అనేది నిర్బంధ బీమా పథకం. దీని లక్ష్యం ECR దేశాలలో విదేశీ ఉపాధి కోసం వెళ్లే ఎమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ (ECR) కేటగిరీ కిందకు వచ్చే భారతీయ వలస కార్మికుల ప్రయోజనాలను కాపాడడం. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, పాస్‌పోర్ట్ కేటగిరీలతో సంబంధం లేకుండా ఎమిగ్రేషన్ యాక్ట్, 1983లోని సెక్షన్ 2(ఓ) ప్రకారం పని కేటగిరీల పరిధిలోకి వచ్చే వివిధ వృత్తులకు కూడా సవరించిన పథకం తప్పనిసరి చేశారు.

ఈ పథకం కింద, విదేశాలలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత వైకల్యం ఏర్పడిన సందర్భంలో బీమా చేసుకున్న వ్యక్తికి రూ. 10 లక్షల మొత్తం అందిస్తారు. సంవత్సరాల కాలానికి ప్రీమియం రూ. 275 నుంచి రూ. 375 వరకు ఏజ్ ను బట్టి ఉంటుంది. పథకానికి అర్హత ప్రమాణం ఏమిటంటే, దరఖాస్తుదారు తప్పనిసరిగా విదేశాలకు వెళ్లిన భారతీయుడు (క్లియర్డ్ ఎమిగ్రేషన్) అయి ఉండాలి. అలాగే దరఖాస్తుదారు వయస్సు 18 నుంచి 65 సంవత్సరాల మధ్య ఉండాలి .
మరణించిన లేదా గాయపడిన వారి కుటుంబాలకు ప్రవాసీ భారతీయ బీమా యోజన పథకాన్ని ఎంచుకున్నట్లయితే, ఈ ప్రయోజనాలను పొందవచ్చు.
ప్రమాదాల కారణంగా మరణించిన సందర్భంలో పథకానికి అవసరమైన పత్రాలు - ప్రమాదవశాత్తు మరణాన్ని నిర్ధారించే పోలీసు నివేదిక; పోస్ట్ మార్టం నివేదిక; సంబంధిత ఇండియన్ ఎంబసీ నుంటి ఒక సర్టిఫికేట్ పాస్‌పోర్ట్ కాపీ ఉండాలి. శాశ్వత వైకల్యం ఉన్న సందర్భంలో పథకంలోని ప్రయోజనాలను పొందేందుకు అవసరమైన పత్రాలు , ప్రమాదం తర్వాత చికిత్సకు సంబంధించిన వైద్య రికార్డులు ఉండాలి.












Click it and Unblock the Notifications