రైతులకు పీఎం కిసాన్ సాయం 2వేలు పెంపు - అమలు ముహూర్తం ఖరారు..!!
రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రైతులకు ఆర్డికంగా తోడ్పాటు అందిస్తున్న కేంద్రం కీలక నిర్ణక్ష్ం తీసుకుంది. కేంద్రం అమలు చేస్తున్నపీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం మొత్తాన్ని పెంచాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించింది. కొంత కాలంగా ఈ మొత్తం పెంపు పైన చర్చ జరుగుతున్నా పార్లమెంట్ ఎన్నికల వేళ అమలుకు శ్రీకారం చుట్టాలని డిసైడ్ అయింది. ఖరీఫ్ నుంచి అమలు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.
పీఎం కిసాన్ సాయం పెంపు: రైతులకు ఆర్థిక చేయూతనిచ్చే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో నగదు మొత్తాన్ని పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఈ పథకం కింద మోదీ ప్రభుత్వం రైతులకు మూడు విడతల్లో మొత్తం రూ.6000లను అందిస్తోంది. ఒకేసారి కాకుండా మూడు వాయిదాల్లో రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది.

ఈ మొత్తాన్ని రూ.8,000కు పెంచే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. రూ.8000లను నాలుగు వాయిదాల్లో చెల్లించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈ వారంలోనే ప్రకటన చేయనున్నటలు సమాచారం.
రూ 2వేల పెంచేలా నిర్ణయం: ఇదే సమయంలో పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన మొత్తాన్ని కూడా పెంచే అవకాశం ఉంది. ఏప్రిల్, మే నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరిగనున్నాయి. వీటికి ముందు నిర్వహించే ఓట్ ఆన్ ఎకౌంట్ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సమయంలో దీనికి సంబంధించి ప్రకటన చేసేందుకు అధికారులు కార్యాచరణ ప్రారంభించారు. పీఎం కిసాన్ పథకం కింద ప్రభుత్వం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు రూ.2,000 జమ చేస్తుంది. ఇప్పుడు వాయిదాల సంఖ్యను ప్రస్తుతం ఉన్న మూడు విడతలను నాలుగు విడతలుగా పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.
నాలుగు విడతలకు పెంపు: 2019లో ప్రారంభమైన పీఎం కిసాన్ పథకానికి ప్రభుత్వం ఇప్పటి వరకు 15 వాయిదాలు ఇచ్చింది. రైతుల ఖాతాల్లో మొత్తం రూ.2.75 లక్షల కోట్లు జమయ్యాయి. నవంబర్ 15న 15వ విడత రుణమాఫీ జరిగింది. గతంలో జూలై చివరి వారంలో 14వ విడత రుణమాఫీ జరిగింది. ఫిబ్రవరి 27న బెల్గాంలో జరిగిన సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ 13వ విడత విడుదల చేయనున్నట్లు ఇప్పటికే అధికార యంత్రంగాం ఖరారు చేసింది. ఇక, కిసాన్ సాయం పెంపు పైన అధికార ప్రకటను కేంద్రం సిద్దమైంది.












Click it and Unblock the Notifications