హీరో మైండ్ బ్లాక్, మర్యాదగా ఓసీఐ కార్డు ఇచ్చేయండి, వీసా రద్దుతో హీరో దేశ బహిష్కరణ ?
బెంగళూరు/న్యూఢిల్లీ: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్లు జీవితంలో బాగుపడినట్లు చరిత్రలోనే లేదు. ఇప్పుడు కన్నడ హీరో చేతన్ అలియాస్ చేతన్ అహింసా విషయంలో మరోసారి రుజువు అయ్యింది. హైకోర్టు న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హీరో చేతన్ ఓసీఓ (వీసా)ను కేంద్ర హోమ్ శాఖ కార్యాలయం రద్దు చేసింది.
వీసా రద్దు చేసిన కేంద్ర హోమ్ శాఖ కార్యాలయం అధికారులు ఎఫ్ఆర్ఆర్ ద్వారా చేతన్ కు లేఖ పంపించి 15 రోజుల లోపు ఓసీఐ కార్డు వెనక్కి ఇవ్వాలని హీరో చేతన్ కు ఆదేశాలు జారీ చేసింది. కన్నడ హీరో చేతన్ ఓసీఓ రద్దు చేస్తూ మార్చి 28వ తేదీన కేంద్ర హోమ్ శాఖ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది.

తరువాత ఆదేశాల పత్రాలను ఎఫ్ఆర్ఆర్ ఓ ద్వారా పంపించడంతో ఏప్రిల్ 14వ తేదీన హీరో చేతన్ కు ఆ పత్రాలు అందాయని సంబంధిత అధికారులు అంటున్నారు. హిజాబ్ వివాదం కేసులో కర్ణాటక హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. ఆ సమయంలో హైకోర్టు న్యాయమూర్తిని ఉద్దేశించి హీరో చేతన్ అహింసా సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టు చేశాడు.
21వ దశాధ్దంలో కూడా న్యాయమూర్తి స్త్రీ ద్వేషిగా ప్రవర్తించి తీర్పు ఇచ్చారని, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో హిజాబ్ ఉండాలా ?, లేదా ? అని న్యాయమూర్తి డిసైడ్ చేస్తున్నారని హీరో చేతన్ ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. రెండు మతాల మధ్య, రెండు వర్గాల మధ్య గొడవలు జరిగేలా రెచ్చగొడుతూ నటుడు చేతన్ పోస్టు చేశాడని అప్పట్లోనే అతని మీద కేసు నమోదు చేసి జైలుకు పంపించారు.

అదే సమయంలో ఎఫ్ఆర్ఆర్ ఓ అధికారులు హీరో చేతన్ మీద కేసు నమోదు చేసిన నీకు ఇచ్చిన వీసాను రద్దు చెయ్యాలని కేంద్ర హోమ్ శాఖకు ఎందుకు శిఫారస్సు చెయ్యకూడదో చెప్పాలని నోటీసులు జారీ చేశారు. ఎఫ్ఆర్ఆర్ ఓ అధికారుల నోటీసులకు కన్నడ హీరో చేతన్ అహింసా సమాధానం కూడా ఇచ్చాడు.
నేను సామాజిక కార్యకర్తగా పని చేస్తున్నానని, తాను సినిమా నటుడిగా, సినిమా నిర్మాణ రంగంలో ఉన్నానని, భారతదేశానికి చెందిన యువతిని వివాహం కూడా చేసుకున్నానని, తన వీసా రద్దు చెయ్యకూడదని హీరో చేతన్ అధికారులకు సమాధానం ఇచ్చాడు. సమాజంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న చేతన్ మీద చర్యలు తీసుకోవాలని కేంద్ర హోమ్ శాఖ కార్యాలయం డిసైడ్ అయ్యింది.
బెయిల్ మీద బయటకు వచ్చిన చేతన్ మళ్లీ ఉరిగౌడ-నంజేగౌడ అనే సినిమా విషయంలో మరోసారి ప్రజలను రెచ్చగొడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో మార్చి 21వ తేదీన బెంగళూరులోని శేషాద్రిపురం పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. తరువాత చేతన్ బెయిల్ మీద బయటకు వచ్చి మళ్లీ వివాదంలో చిక్కుకున్నాడు.

నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న హీరో చేతన్ వీసాను రద్దు చెయ్యాలని కేంద్ర హోమ్ శాఖ కార్యాలయం డిసైడ్ అయ్యింది. ఓసీఐ కార్డు అధికారులకు అప్పగించిన తరువాత హీరో చేతన్ దేశం విడిచి వెళ్లిపోవాలి. తరువాత హీరో చేతన్ మళ్లీ వీసాకు అర్జీ పెట్టుకోవాలి. సంబంధిత అధికారులు వీసా మంజూరు చేసిన తరువాతే హీరో చేతన్ భారతదేశంలో అడుగుపెట్టడానికి అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు.
అయితే ఈ విషయంలో చేతన్ నుంచి క్లారిటీ తీసుకోవాలని శనివారం కన్నడ మీడియా అనేక ప్రయత్నాలు చేసినా ఎవ్వరికి చిక్కకుండా హీరో చేతన్ అండర్ గ్రౌండ్ లోనే ఉండిపోయాడని తెలిసింది. మొత్తం మీద శ్రీవెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న కన్నడ హీరో చేతన్ కు ఇప్పుడు దేశం విడిచిపెట్టి వేళ్లే పరిస్థితి ఎదురు కావడం హాట్ టాపిక్ అయ్యింది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications