న్యూ ఇయర్ వేళ బిగ్ షాక్ - భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..!!
కొత్త సంవత్సరం ప్రారంభం వేళ భారీ షాక్. ప్రతీ నెలా ఒకటో తేదీన పెట్రో ఉత్పత్తులు... ఎల్పీజీ ధరల పైన సమీక్ష లో కొత్త ధరలను ఖరారు చేస్తారు. అందులో భాగంగా ఈ రోజు గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 2023 లో పెరిగిన ధర తరువాత 28 నెలల కాలంలో ఈ పెరుగుదల అతి ఎక్కువ. దీంతో, ఇప్పుడు ప్రధాన నగరాల్లో గ్యాస్ సిలిండర్ ధరల్లో భారీగా మార్పులు అమల్లోకి వచ్చాయి.
కొత్త సంవత్సరం ప్రారంభం రోజునే షాక్ తప్ప లేదు. గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఈ పెంపు దల వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్ల కే పరిమితం చేసారు. డొమెస్టిక్ గ్యాస్ పైన ఎలాంటి పెంపు లేదు. చివరిసారిగా ఇంత భారీ పెరుగు దల అక్టోబర్ 2023 లో జరిగింది. వాస్తవానికి, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలో ఈ పెరుగుదల కనిపించింది. రూ 50 మేర పెంచుతూ ఈ రోజు నుంచి నిర్ణయం అమల్లోకి తేవాలని నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని నాలుగు మెట్రోపాలిటన్ నగరాల్లో మూడింటిలో రూ. 111 పెరుగుదల కనిపించగా, ఒకటి రూ. 110 పెరిగింది. ఫలితంగా, దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర దాదాపు రూ. 1,700కి చేరుకుంది.

ఈ ధరలు జూన్ 2025 తర్వాత ఇదే అత్యధికం. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వెల్లడించిన లెక్కల ప్రకారం నవంబర్ 2023 తర్వాత రూ. 100 కంటే ఎక్కువ పెరగడం ఇదే మొదటిసారి. అక్టోబర్ 2023 తర్వాత వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరల్లో ఇదే అతిపెద్ద పెరుగుదల. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై మెట్రోపాలిటన్ నగరాల్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు రూ. 111 పెరిగాయి. దీనితో పాటు వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర వరుసగా రూ. 1,691.50, రూ. 1,795, రూ. 1,642.50కి చేరుకుంది.
చెన్నైలో, వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ. 110 పెరిగి రూ. 1,849.50కి చేరుకుంది. కాగా.. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరలో ఎటువంటి మార్పు లేదు. ప్రభుత్వం చివరి సారిగా మార్చి 2024లో కంపెనీలు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరను రూ. 50 పెంచింది. అయితే, లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ సిలిండర్ల ధరను భారీగా తగ్గించింది.












Click it and Unblock the Notifications