ప్రతిపక్షాల దెబ్బకు దిగివచ్చిన ప్రభుత్వం, సీఎం ఏం చెప్పారంటే ?, కాలేజ్ లో ఇలా జరిగిందంటే !

కాలేజ్ అమ్మాయిని క్యాంపస్ లోనే ముస్లీం యువకుడు అతి కిరాతకంగా హత్య చెయ్యడం కలకలం రేపింది. కాలేజ్ అమ్మాయి హత్య కేసులో సీఎంతో పాటు ప్రభుత్వ పెద్దలు హంతకులను కాపాడటానికి ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఇదే సమయంలో హత్యకు గురైన యువతి విషయంలో సీఎం సిద్దరామయ్య సానుభూతి చూపించి ఓ ట్విట్ చేసి సైలెంట్ అయిపోయారని ప్రతిపక్షాలు రాష్ట్రం మొత్తం ఆందోళనలు చేస్తున్నాయి.

కాలేజ్ అమ్మాయి నేహాని హత్య చేసిన ఫయాజ్ ను కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. హత్యకు గురైన నేహా తండ్రి నిరంజన్ హీరేమఠ్ హుబ్బళి-ధారవాడ కార్పోరేషన్ కార్పోరేటర్ కావడంతో ఈ హత్య కేసుకు రాజకీయ రంగుపు పులుముకుంది. ఇప్పుడు నేహా హిరేమఠ్ హత్య కేసు రోజుకు ఒక మలుపు తిరుగుతోంది. నేహా హత్య కేసు నిందితులకు తగిన శిక్ష విధించాలని కర్ణాటక రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు.

The CM said that the investigation of the murder of college girl NeHa will be handed over to the CID

నేహా హత్య కేసులోని నిందితులను సిద్దరామయ్య ప్రభుత్వం రక్షిస్తోందని ఆరోపిస్తూ సోమవారం కర్ణాటకలోని అన్ని నగరాలు, పట్టణాల్లో బీజేపీ, జేడీఎస్ పార్టీలు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో శివమొగ్గలోని విమానాశ్రయంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడారు. కాలేజ్ అమ్మాయి నేహా హత్య కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించాలని నిర్ణయించామని సీఎం సిద్దరామయ్య తెలిపారు.

The CM said that the investigation of the murder of college girl NeHa will be handed over to the CID

ఇదే అంశంపై సోమవారం బీజేపీతో పాటు జేడీఎస్ పార్టీతో సహ పలు సంస్థలు, విద్యార్థి సంఘాలు కూడా నిరసన తెలిపి నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. దీనిపై ఇప్పుడు సీఎం సిద్దరామయ్య మాట్లాడారు. ఈ విషయంలో రాజకీయాలు చేయవద్దని సీఎం సిద్దరామయ్య ప్రతిపక్షాలకు మనవి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే రాష్ట్రంలో ఇలాంటి చర్యలు పెరుగుతున్నాయని బీజేపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు.

హుబ్బళి- ధారవాడ మహానగర కార్పొరేషన్ కార్పోరేటర్ నిరంజన్ హిరేమత్ కుమార్తె నేహా హిరేమఠ్ అలియాస్ నేహాను ముస్లిం యువకుడు ఫయాజ్ కత్తితో దారుణంగా పొడిచి కిరాతకంగా హత్య చెయ్యడం కర్ణాటకలో కలకలం రేపింది. లోక్ సభ ఎన్నికల పోలింగ్ సమీపించిన సమయంలో హుబ్బళిలో హిందూ అమ్మాయిని ముస్లీం యువకుడు హత్య చెయ్యడంతో కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు తాము రాజకీయంగా నష్టపోతామని భయంతో హడలిపోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+