కమల్ నాథ్ రాజీనామా ?, హైకమాండ్ ఏం చెప్పింది, ఢిల్లీలో ?, మోదీ దెబ్బకు మైండ్ బ్లాక్ !
ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ తప్పా వేరే రాష్ట్రాల్లో సత్తా చాటుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు మైండ్ బ్లాక్ అయ్యింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లో బీజేపీ హవాతో కాంగ్రెస్ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుకుంది. మిజోరంలో ముందుగా అందరూ ఊహించినట్లే జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ సరిపెట్టుకుంది.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కమల్‌నాథ్ తన పదవికి రాజీనామా చేశారన్న వార్త వైరల్‌గా మారింది. 230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్ లో 163 స్థానాల్లో విజయం సాధించి బీజేపీ మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 66 స్థానాల్లో విజయం సాధించింది. నవంబర్ 17వ తేదీన మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఒకే దశలో ఓటింగ్ జరిగింది. రికార్డు స్థాయిలో 76.22 శాతం ఓటింగ్ నమోదైంది. బీజేపీకి 163 సీట్లను, కాంగ్రెస్ 66 సీట్లను, బీఏపీ 1 సీటును గెలుచుకున్నాయి.

మధ్యప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ఓటమికి మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్ కారణమని పలువురు సొంత పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. 77 ఏళ్ల కమల్ నాథ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు వచ్చిన వార్తలను కాంగ్రెస్ తోసిపుచ్చింది.

న్యూఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్‌తో కమల్‌నాథ్ భేటీ అయ్యారు. ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేశారని, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడి నియామకంపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది ఫేక్ న్యూస్ అని కాంగ్రెస్ రాష్ట్ర శాఖ, ఆ పార్టీ హైకమాండ్ కూడా స్పష్టం చేసింది. డిసెంబరు 5వ తేదీన రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ పదవికి రాజీనామా చేయాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి.

ఈ వార్తల వైరల్ అవుతున్న సమయంలోనే కమల్ నాథ్ ఢిల్లీ వెళ్లి మల్లికార్జున ఖర్జున్ ఖార్గేతో భేటీ అయ్యారని తెలిసింది. మధ్యప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ముందస్తు ఎన్నికల సర్వేలు అంచనా వేశాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ కూడా ఒకటి. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై అధికార వ్యతిరేక ఉందని పలు సర్వేలు అంచనావేశాయి.

కానీ కమల్ నాథ్ నేతృత్వంలోని ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రజల మద్దతు పొందడంలో పూర్తిగా విఫలమైంది. బీజేపీ 163 నియోజకవర్గాల్లో విజయం సాధించి స్పష్టమైన మెజారిటీ సాధించింది. రాష్ట్రంలో భాజపా ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నా కాంగ్రెస్ పార్టీ ప్రజలతో మమేకమై, అధికార పార్టీకి వ్యతిరేకంగా పెద్దఎత్తున పోరాటం చేసి, ప్రజాఉద్యమాన్ని నిర్వహించడంలో విఫలమైందనేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?












Click it and Unblock the Notifications