బెంగళూరులో అక్కడ హై టెన్షన్, భీఫామ్ వచ్చినా నామినేన్ కు మాత్రం ?

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టంగా ఉంది. బీఫామ్ వచ్చిందనే ఆనందంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి ఓ నాయకుడు సిద్దం అయ్యారు. నామినేషన్ వెయ్యడానికి సర్వం సిద్దం చేసుకుంటున్న సమయంలో హైకమాండ్ నుంచి రెండు రోజులు వేచి చూడాలని ఫోన్ రావడంతో ఆయన షాక్ అయ్యారు.

బెంగళూరు సిటీలోని పద్మనాభనగర నియోజక వర్గంలో బీజేపీ సీనియన్ నాయకుడు అశోక్ పోటీ చేస్తున్నారు. వరుస విజయాలతో ఎమ్మెల్యేగా గెలుపొందుతూ వచ్చిన ఆర్. అశోక్ బీజేపీలో సీనియర్ మంత్రిగా పని చేశారు. ఆర్. అశోక్ మీద పోటీలో దింపడానికి కాంగ్రెస్ పార్టీ అనేక మంది నాయకుల మీద పేర్లు పరిశీలించింది. ఈ నియోజక వర్గంలో ప్రవాసాంధ్రుల ఓట్లు కీలకంగా మారాయి.

 Congress party high command

చివరికి బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, ప్రవాసాంధ్రుడు రఘునాథ నాయుడికి టిక్కెట్ ఇచ్చారు. కేపీసీసీ కార్యాలయానికి రఘనాథ నాయుడికి ఫోన్ చేసి రప్పించుకున్న డీకే. శివకుమార్ నువ్వు నామినషన్ వేసుకోపో అంటూ చెప్పారు. బీఫామ్ వచ్చిందనే ఆనందంలో రఘునాథ నాయుడు డీకే. శివకుమార్ తో ఫోటో కూడా తీసుకుని చాలా సంతోషంగా ఇంటికి వెళ్లిపోయారు.

నామినేషన్ వెయ్యడానికి రఘునాథ నాయకుడు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఉదయం రఘునాథ నాయుడికి ఫోన్ చేసిన డీకే. శివకుమార్ నువ్వు రెండు రోజులు వేచి చూడాలని, ఈరోజు నామినేషన్ వెయ్యకూడదని సూచించారు. చివరి నిమియంలో రఘునాథ నాయుడు నామినేషన్ వెయ్యకూడదని డిసైడ్ అయ్యారు.

 Congress party high command
పధ్మనాభనగర్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డీకే. శివకుమార్ సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ డీకే. సురేష్ అని ఇంతకాలం ప్రచారం జరిగింది. మంత్రి ఆర్. అశోక్ ను ఎదుర్కోవాలంటే డీకే. సురేష్ రంగంలోకి దిగాలని డీకే. శివకుమార్ నిర్ణయించారని తెలిసింది. కనకపురలో తనతో పోటీకి దిగిన అశోక్ కు ధీటుగా సమాధానం చెప్పాలని, తనను ఓడించడానికి వచ్చిన అశోక్ ను ఓడించాలని డీకే శివకుమార్ చివరి నిమిషంలో డిసైడ్ అయ్యారని తెలిసింది.

డీకే. శివకుమార్ ఆయన తమ్ముడు డీకే. సురేస్ ను పధ్మనాభనగర్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దింపడానికి డిసైడ్ అయ్యారని, అందుకే చివరి నిమిషంలో రఘునాథ నాయుడిని నామినేషన్ వెయ్యకుండా చూశారని తెలిసింది. మొత్తం మీద పధ్మనాభ నగర్ లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+