కూతురు రాఖీ కట్టడానికి కొడుకు లేడు, దంపతులు ఏం చేశారంటే, షాక్ మీద షాక్ !

న్యూఢిల్లీ/బెంగళూరు: దేశ వ్యాప్తంగా రాఖీ పండుగ సందడి ప్రారంభం కానుంది. సోదరీమణులు అన్నదమ్ములకు రాఖీ కట్టి రక్షణ కోరే రోజు. అయితే ఢిల్లీలో రాఖీ పండుగ దంపతులను జైలుపాలు చేసింది. రక్షాబంధన్ వచ్చిందంటే రాఖీ కట్టేందుకు అన్నా, తమ్ముడు లేరని కూతురు చెప్పడంతో మనస్తాపానికి గురైన తల్లిదండ్రులు 1నెల రోజుల వయసు ఉన్న బాలుడిని కిడ్నాప్ చేసిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

ఉత్తర ఢిల్లీలోని ఠాగూర్ గార్డెన్‌లోని రఘుబీర్ నగర్ పోలీసులు 41 ఏళ్ల సంజయ్ గుప్తా, అతని భార్య అనితా గుప్తాను అరెస్టు చేశారు. ఏడాది క్రితం ఈ దంపతుల కుమారుడు మృతి చెందాడు. ఈసారి రక్షాబంధన్‌కు రాఖీ కట్టేందుకు తనకు అన్నా కాని, తమ్ముడు కాని లేరని కూతురు చెప్పడంతో ఉత్తర ఢిల్లీలో 30 రోజుల చిన్నారిని దంపతులు ఇద్దరు కిడ్నాప్ చేశారని పోలీసులు తెలిపారు.

The couple kidnapped the boy because he did not have a son to tie his daughters Rakhi
తెల్లవారుజామున 4.30 గంటలకు వికలాంగ మహిళ కుమారుడిని కిడ్నాప్ చేసినట్లు తమకు సమాచారం అందిందని పోలీసులు అన్నారు. తాము చట్టా రైలు చౌక్‌లోని ఫుట్‌పాత్‌పై నివసిస్తున్నామని, తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో నిద్ర లేచి చూసేసరికి తమ బిడ్డను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు గుర్తించామని దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విచారణ సందర్భంగా పోలీసులు పలు సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ఈ సమయంలో ఫుట్‌పాత్‌ సమీపంలో ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై సంచరిస్తూ కనిపించారు. వీరిద్దరే కిడ్నాపర్లు అయి ఉంటారని పోలీసులకు అనుమానం వచ్చింది. ఆ తర్వాత 400 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు అతడిని ఎల్‌ఎన్‌జీపీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు అన్ని వివరాలను సేకరించడంతో బైక్ సంజయ్ గుప్తా పేరిట రిజిస్టర్ అయినట్లు పోలీసులు గుర్తించారు.

సంజయ్ గుప్తా ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. సంజయ్ భార్యతో కలిసి ఠాగూర్ గార్డెన్‌లోని రఘుబీర్ నగర్‌లోని సి-బ్లాక్‌కు వెళ్లాడు. అపహరణకు గురైన చిన్నారి కూడా అక్కడే దొరికిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్) సాగర్ సింగ్ కల్సి తెలిపారు. సంజయ్ గతంలో మూడు క్రిమినల్ కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+