స్టార్ హీరో మైండ్ బ్లాక్, వేరే జైలుకు పంపించాలని కోర్టు ఆర్డర్, లగ్జరీ లైఫ్ కు చెక్
బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ప్రత్యేక సౌకర్యాల పొందుతున్నారని హీరో దర్శన్ పై ఆరోపణలు వచ్చాయి. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో ఏ2 నిందితుడైన హీరో దర్శన్‌ను బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి బళ్లారి సెంట్రల్ జైలుకు తరలించేందుకు ప్రత్యేక కోర్టు అనుమతించింది. ఈ దెబ్బతో శ్యాండిల్ వుడ్ హీరో దర్శన్ షాక్ అయ్యాడని తెలిసింది.
హత్య కేసులో నిందితులందరినీ ఒక్కొక్కరిగా కర్ణాటక రాష్ట్రంలోని ఇతర జిల్లా జైలుకు బదిలీ చేయడానికి కోర్టు జైళ్ల శాఖ అధికారులను అనుమతించింది. హీరోదర్శన్‌ను బళ్లారి సెంట్రల్ జైలుకు తరలించేందుకు కోర్టు అంగీకరించింది. ప్రముఖ రౌడీషీటర్లు నాగరాజు అలియాస్ విల్సన్ గార్డెన్ నాగ, శ్రీనివాసులు అలియాస్ కుళ్ల శీన, ధర్మకు ఇప్పుడు ఇబ్బందులు ఎదురైనాయని తెలిసింది.

ఇది కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వానికి తలవంపులు తెచ్చింది. ఈ నేపథ్యంలో నిందితులను వేర్వేరు జైళ్లకు తరలించాలని పలువురు రిమాండ్ చేశారు. ఇదే విషయంలో సీఎం సిద్ధరామయ్య సంబంధిత అధికారులపై మండిపడ్డారని తెలిసింది. ఈ సందర్బంలో హీరో దర్శన్ తో పాటు నిదితులను వేరే జైళ్లకు తరలించడానికి కోర్టు అనుమతి కోసం ఎదురు చూశారు.ఇప్పుడు నిందితులను ఒక్కొక్కరిని వేర్వేరు జైళ్లకు తరలించేందుకు బెంగళూరులోని 24వ ఏసీఎంఎం కోర్టు అనుమతించింది.












Click it and Unblock the Notifications