టర్ప్ క్లబ్ లో బెట్టింగ్, రౌడీషీటర్ల ఎంట్రీ, వెనుక వైట్ కాలర్, ఏం జరుగుతోంది, కోట్లలో జీఎస్టీ ?

బెంగళూరు టర్ఫ్‌క్లబ్‌పై (రేస్ కోర్స్ రోడ్డులోని గుర్రపు పందెం) బెంగళూరు సీసీబీ పోలీసులు దాడులు చెయ్యడం కలకలం రేపింది. టర్ప్ క్లబ్ దాడి కేసుకు సంబంధించి బెంగళూరు నగర పోలీసు కమీషనరర్ దయానంద్ మీడియాకు సమాచారం అందించారు. ఎలాంటి రసీదులు లేకుండానే అక్రమంగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ బి. దయానంద మీడియాకు చెప్పారు.

రౌడీలు, రౌడీషీటర్లు అనధికారిక వ్యక్తుల ద్వారా కూడా టర్ప్ క్లబ్ లో బెట్టింగ్‌లు జరుగుతున్నాయని సమాచారం అందడంతో బెంగళూరు సీసీబీ ప్రత్యేక దర్యాప్తు బృందం దాడులు చేసింది. బీటీసీ పై అనధికార బెట్టింగ్ లు జరుగుతున్నాయని పోలీసులకు సమాచారం అందింది. ఎలాంటి రసీదు పత్రాలు, రసీదు లేకుండానే కోట్ల రూపాయల బెట్టింగ్ డబ్బు లావాదేవీలు జరిగాయని పోలీసు అధికారులు అంటున్నారు.

The crime branch police arrested the rowdy sheeters who were running a betting gang in the Bengaluru Turp Club

ఈ నేపథ్యంలో బెంగళూరు సీసీబీ పోలీసుల దాడి తర్వాత రూ 3 కోట్ల 45 లక్షల డబ్బు దొరికిందని బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ దయానంద్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి 66 మందిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వారిని విచారించి సమాచారం సేకరించామని, సెక్షన్ 41 కింద అందరికి నోటీసు జారీ చేశామని, ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని బెంగళూరు సిటీ పోలీసు కమీషనరక్ తెలిపారు.

అక్రమ బెట్టింగ్ వ్యాపారంలో ఎవరికి లాభం?, దీని వెనుక ఎవరెవరు ఉన్నారనే సమాచారం పోలీసులకు లీక్ అయిందని తెలిసింది. అక్రమ బెట్టింగ్ కారణంగా ప్రభుత్వానికి జీఎస్టీ చెల్లించడంలో మోసం జరిగిందని, 28% GST ప్రభుత్వానికి చెల్లించాలని, కానీ జీఎస్టీ పన్ను చెల్లించకుండా నిందితులు బెట్టింగ్ దందా నిర్వహిస్తున్నారని పోలీసులు అంటున్నారు. అనధికార వ్యక్తులు, రౌడీషీటర్లు అక్రమంగా బెట్టింగ్ కౌంటర్ నడుపుతున్నట్లు మాకు సమాచారం అందిందని పోలీసు అధికారులు తెలిపారు.

The crime branch police arrested the rowdy sheeters who were running a betting gang in the Bengaluru Turp Club

ఆ కోణంలో మరింత సమాచారం రాబట్టి విచారణ జరుపుతామని బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ తెలిపారు. బెంగళూరులోని రేస్‌కోర్సుపై శుక్రవారం సాయంత్రం సీసీబీ టీమ్ దాడులు చేసింది. శనివారం అర్ధరాత్రి 1 గంట వరకు దాడులు కోనసాగాయి. ఈ సోదాల్లో దాదాపు రూ 3 కోట్ల 47 లక్షల డబ్బు దొరికింది. లెక్కల్లో చూపని డబ్బు, జీఎస్టీ అవకతవకలకు సంబంధించి ఈ దాడులు నిర్వహించి కొంత మందిని అరెస్టు చేశామని బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ తెలిపారు. టర్ప్ క్లబ్ లో సీసీబీ రైడ్‌లో పట్టుబడిన వారిపై బెంగళూరు హైగ్రౌండ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+